AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: భారతీయులకు షాకిచ్చిన వాట్సాప్‌.. 85 లక్షల ఖాతాలపై నిషేధం.. కారణం ఏంటంటే..

Whatsapp Accoounts Banned: వాట్సాప్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లోనే మునిగి తేలుతున్నారు. అయితే వాట్సాప్‌లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వాట్సాప్‌ సంస్థ కొరడా ఝులిపిస్తోంది. అలాంటి ఖాతాలను బ్యాన్‌ చేస్తోంది..

Whatsapp: భారతీయులకు షాకిచ్చిన వాట్సాప్‌.. 85 లక్షల ఖాతాలపై నిషేధం.. కారణం ఏంటంటే..
ముఖ్యంగా సర్టిఫికేట్స్‌, ఆడియోలు, వీడియోలు, ఫోటోలు వంటి ముఖ్యమైన సమాచారం వాట్సాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంలో డేటాను కోల్పోకుండా ఉండాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి.
Subhash Goud
|

Updated on: Nov 04, 2024 | 5:00 PM

Share

సెప్టెంబర్‌లో పాలసీని ఉల్లంఘించిన 85 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. కంపెనీ తన నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారుల భద్రతను పెంచడానికి, ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి కంపెనీ ఈ చర్య తీసుకుంది. అంతకుముందు ఆగస్టులో భారతదేశంలో 84 లక్షల ఖాతాలు నిషేధించింది. వాట్సాప్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 30 మధ్య వాట్సాప్‌ 85,84,000 ఖాతాలను నిషేధించింది. వాటిలో 16,58,000 ఖాతాలు వినియోగదారుల నుండి ఎటువంటి నివేదికలు అందుకోకముందే మూసివేసింది. 600 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్‌కు సెప్టెంబర్ నెలలో 8,161 ఫిర్యాదులు అందాయి. వాటిలో 97 పై చర్యలు తీసుకుంది.

దీనికి సంబంధించి కంపెనీ స్పందిస్తూ, మా పనిలో పారదర్శకతను నిర్వహిస్తున్నాము.. భవిష్యత్ నివేదికలలో మా ప్రయత్నాల గురించి పూర్తి సమాచారాన్ని అందించాము. ఇటువంటి ఖాతాలపై దృష్టి సారించి నిషేధిస్తామని వాట్సాప్‌ తెలిపింది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌పై చాలా శ్రద్ధ వహిస్తామని, తప్పుడు సమాచారాన్ని నిరోధించడంలో, సైబర్ భద్రతను ప్రోత్సహించడంలో నిపుణులతో కలిసి పని చేస్తామని తెలిపింది.

ఈ చట్టం ప్రకారం చర్యలు

2021లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నియమం ప్రకారం.. 50 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులతో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వారిపై తీసుకున్న ఫిర్యాదులు, చర్యల ప్రతి వివరాలను పేర్కొనడం తప్పనిసరి 2021 రూల్ 4(1)(D), రూల్ 3A(7) ప్రకారం ఇది అమలు చేస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ఇది వినియోగదారులకు భద్రతగా ఉంటుందని వెల్లడించింది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..