AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo X300: కళ్లు చెదిరే కెమెరా సెటప్‌తో వివో కొత్త ఫోన్! ఫీచర్లివే..

వివో నుంచి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అడ్వాన్స్‌డ్ కెమెరా ఫీచర్లతో వివో X300, X300 ప్రో మొబైళ్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో చాలా ప్రత్యేకమైన కెమెరా సెన్సర్లను వాడారు. ఇమేజ్ క్వాలిటీని హైలైట్ చేస్తూ ఈ సిరీస్ ను లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

Vivo X300: కళ్లు చెదిరే కెమెరా సెటప్‌తో వివో కొత్త ఫోన్! ఫీచర్లివే..
Vivo X300
Nikhil
|

Updated on: Oct 14, 2025 | 4:13 PM

Share

వివో నుంచి వచ్చిన X300, X300 ప్రో మొబైళ్లు పవర్ ఫుల్ ప్రాసెసర్ తో పాటు, జిస్ (Zeiss) బ్రాండెడ్ కెమెరా సెన్సర్లను కలిగి ఉన్నాయి. అలాగే ఇందులో మెరుగైన బ్యాటరీ, డిస్ ప్లే ఫీచర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫొటోగ్రఫీపై ఫోకస్ చేసి రిలీజ్ చేసిన ఈ మొబైల్స్.. గేమింగ్, డే టు డే లైఫ్ కు కూడా బాగుంటాయి. పూర్తి స్పెసిఫికేషన్లలోకి వెళ్తే..

వివో X300

వివో X300 మొబైల్ లో 6.3- ఇంచ్ LTPO డిస్ ప్లే ఉంటుంది. HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. 2కె రెజల్యూషన్ స్క్రీన్ 120 Hz రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్.. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఇక ఈ మొబైల్ లో మెయిన్ హైలైట్ కెమెరా. ఇందులో zeiss  బ్రాండ్ కు చెందిన ట్రిపుల్ మెయిన్ కెమెరా సెటప్ ఉంటుంది.200MP మెయిన్ కెమెరా + 50MP సూపర్ టెలీఫోటో కెమెరా + 50MP సూపర్ అల్ట్రా వ్యూ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. మరో 50 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది 40W వైర్ లెస్ ఛార్జింగ్,90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 6040mAh ఉంటుంది.

వివో X300 ప్రో

ఇక వివో X300 ప్రో మొబైల్ లో కూడా సిమిలర్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి.  అయితే ఇది మరింత పెద్ద స్క్రీన్ తో వస్తుంది. ఇందులో  120HZ రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేసే 6.78-ఇంచ్ ALOMED డిస్ ప్లే  ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది.  4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. ఇది కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ పై పనిచేస్తుంది . ఇందులో కూడా సేమ్ కెమెరా, బ్యాటరీ సెటప్ ఉంటాయి. ఈ రెండు మొబైళ్లకు అదనంగా కెమెరా లెన్స్ సెట్ చేసుకునే ఫెసిలిటి కూడా ఉంది.

ధరలు

ఇక ధరల విషయానికొస్తే.. ఈ మొబైళ్లు ఇంకా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవ్వలేదు. వచ్చె నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.  వివో X300 12GB RAM +256GB  వేరియంట్ ధర ఇండియాలో సుమారు రూ. 60,000 ధర వరకు ఉండొచ్చు. వివో X300 ప్రో మోడల్‌ ధర రూ. 99,999 వరకు ఉండవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి