Strong Password: మీ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే పాస్‌వర్డ్ ఇలా పెట్టుకోవాలి!
అకౌంట్ ఏదైనా దాని పాస్‌వర్డ్ స్ట్రాంగ్ గా ఉంటేనే అది సేఫ్ గా ఉంటుంది. అయితే పాస్‌వర్డ్ లు పెట్టుకునే విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటుంటారు. దీని వల్ల మీ ప్రైవసీ మాత్రమే కాకుండా మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రమాదంలో పడతాయి. అసలు పాస్‌వర్డ్ ఎలా ఉండాలంటే..

సోషల్ మీడియా అకౌంట్ అయినా, నెట్ బ్యాంకింగ్ అకౌంట్ అయినా పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉంటేనే అకౌంట్ సేఫ్‌గా ఉంటుంది. పాస్‌వర్డ్‌లు పెట్టుకునేటప్పుడు మొబైల్ నెంబర్లు, డేట్ ఆఫ్ బర్త్.. ఇలాంటి ఈజీగా ఉండేవి సెట్ చేసుకోకూడదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు కూడా చాలామంది బేసిక్ పాస్‌వర్డ్స్ పెడుతున్నట్టు చాలా స్టడీలు చెప్తున్నాయి.
బేసిక్ పాస్‌వర్డ్స్
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది పాస్‌వర్డ్స్‌లో ‘123456’ ‘admin’, ‘password’ వంటి పదాలు ఉన్నాయి. ఇవి హ్యాక్ చేయడానికి చాల ఈజీగా ఉండే పాస్ వర్డ్ లు. సైబర్ నేరాలు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో పాస్‌వర్డ్‌లు మరింత స్ట్రాంగ్ గా పెట్టుకోవడం ఎంతైనా అవసరం అని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్
అకౌంట్‌కు పాస్‌వర్డ్స్ పెట్టుకునేటప్పుడు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. అది ఎనిమిది లెటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. పాస్‌వర్డ్‌లో ఆల్ఫాబెట్స్, నెంబర్స్, సింబల్స్.. ఉండేలా చూసుకోవాలి. మళ్లీ ఆల్ఫాబెట్స్‌లో ఒకటి లేదా రెండు అప్పర్ కేస్‌లు ఉండాలి. అలాగే నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్స్ లేదా సింబల్స్ వంటివి కూడా ఉండాలి. పాస్‌వర్డ్స్‌గా మీ పేర్లు, ఇంటి పేర్లు, మొబైల్ నెంబర్లు, డేట్ ఆఫ్ బర్త్ వంటివి పెట్టుకుంటే వాటిని హ్యాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ మిస్టేక్ చేయొద్దు.
డిఫరెంట్ పాస్‌వర్డ్స్
ఇకపోతే వేర్వేరు అకౌంట్లకి వేర్వేరు పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలి. అన్నింటికి ఓకే పాస్‌వర్డ్ లేకుండా చూసుకోవాలి. అలాగే నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ప్రతి మూడు నెలలకొకసారి మారుస్తుండాలి. మీ పాస్‌వర్డ్‌ని ఎవ్వరితో షేర్ చేసుకోవద్దు. ఎవరికైనా మీ పాస్‌వర్డ్ తెలిసినట్టు అనుమానం వస్తే వెంటనే దాన్ని మార్చేయాలి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




