Huawei Triple Folding: త్వరలోనే ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ లాంచ్.. మెంటల్ ఎక్కిస్తున్న నయా ఫీచర్లు
ప్రపంచవ్యాప్తంగా టాప్ స్మార్ట్ కంపెనీలన్నీ ఇటీవల కాలంలో ఫోల్డబుల్ ఫోన్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ రిలీజ్ చేసి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. సామ్‌సంగ్ ఫోన్‌కు వచ్చి ఆదరణతో అన్ని కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Huawei త్వరలోనే ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది.
ప్రపంచవ్యాప్తంగా టాప్ స్మార్ట్ కంపెనీలన్నీ ఇటీవల కాలంలో ఫోల్డబుల్ ఫోన్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ రిలీజ్ చేసి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. సామ్‌సంగ్ ఫోన్‌కు వచ్చి ఆదరణతో అన్ని కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Huawei త్వరలోనే ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ మేరకు ఆ కంపెనీ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. వచ్చే వారం చైనాలో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఆ కంపెనీ సీఈఓ రిచర్డ్ యు ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో Huawei లాంచ్ చేయబోయే ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Huawei లాంచ్ ఈవెంట్ తేదీ ధ్రువీకరించినా ఈ షోలో ఏయే ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నారో? అధికారికంగా ధ్రువీకరించలేదు. ట్రిపుల్-ఫోల్డింగ్ ఫోన్‌తో పాటు, ఈవెంట్ సమయంలో Huawei కొత్త హార్మోనీ ఓఎస్ స్మార్ట్ డ్రైవింగ్ ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 10న జరుగుతుందని సీఈఓ రిచర్డ్ యు ప్రకటించారు. ఈ ఈవెంట్ పోస్టర్ ట్రై-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన సిల్హౌట్ కనిపిస్తుంది. Huaweiకు సంబంధించిన ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ 10 అంగుళాల ఇన్నర్ స్క్రీన్‌తో టాబ్లెట్ లాంటి బిల్డ్ క్వాలిటీతో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక మిగిలిన రెండు స్క్రీన్‌ల విషయానికి వస్తే రెండు ఇన్‌వర్డ్ స్క్రీన్‌లు మరియు డ్యూయల్-హింజ్ సిస్టమ్ ద్వారా అటాచ్ చేసిన అవుట్‌వర్డ్ స్క్రీన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. కిరిన్ 9 సిరీస్ చిప్‌సెట్‌లో రన్ అవుతుందని, అలాగే సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, స్లిమ్ డిజైన్ ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత టెక్నాలజీకు అనుగుణంగా ఈ ఫోన్‌లో ఏఐ ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టడం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫోల్డబుల్ మార్కెట్‌లో సామ్‌సంగ్‌పై హువావే పైచేయి సాధించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 10 లాంచ్ ఈవెంట్ Huaweiతో యాపిల్ కూడా సెప్టెంబర్ 9న లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..