Tech Tips: నెట్ స్లోగా ఉందా? ఈ టిప్స్ పాటిస్తే.. 5జీ రేంజ్ స్పీడ్ పక్కా.. ట్రై చేయండి..

బఫరింగ్ అనేది లేని నిరంతరాయ, వేగవంతమైన నెట్ కావాలని మనందరం కోరుకుంటున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో నెట్ వర్క్ బాగానే ఉన్నా.. ఇంటర్నెట్ నెమ్మదిగా ఉంటుంది. ఆ సమయంలో కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మనం నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. అవి మన స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ లోనే ఉంటాయి.

Tech Tips: నెట్ స్లోగా ఉందా? ఈ టిప్స్ పాటిస్తే.. 5జీ రేంజ్ స్పీడ్ పక్కా.. ట్రై చేయండి..
Internet
Follow us

|

Updated on: Sep 04, 2024 | 3:18 PM

ప్రస్తుతం సమాజంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. పట్టణాలు, నగరాలు మాత్రమే కాక, మారుమూల పల్లెల్లో కూడా స్మార్ట్ ఫోన్, అందులో ఇంటర్నెట్ తప్పనిసరి అయిపోయింది. సోషల్ మీడియా, యూ ట్యూబ్ వంటి మాధ్యమాలు అందరికీ అలవాటుగా మారిపోయాయి. వాటి ద్వారానే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలుసుకునే వెసులుబాటు కలుగుతోంది. అయితే మనం ఇంటర్నెట్ వినియోగిస్తున్నప్పుడు దాని స్పీడ్ కూడా ముఖ్యమే. గతంలో ఇంటర్నెట్ వినియోగం తక్కువ దాని స్పీడ్ కూడా తక్కువే. కానీ ఇప్పుడు 4జీ, 5జీ నెట్ వర్క్ లు అందుబాటులోకి వచ్చాకా.. కాస్త లోడ్ అయ్యేందుకు సమయం తీసుకున్నా భరించలేని విధంగా మన సైకాలజీ ఏర్పడింది. బఫరింగ్ అనేది లేని నిరంతరాయ, వేగవంతమైన నెట్ కావాలని మనందరం కోరుకుంటున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో నెట్ వర్క్ బాగానే ఉన్నా.. ఇంటర్నెట్ నెమ్మదిగా ఉంటుంది. ఆ సమయంలో కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మనం నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. అవి మన స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ లోనే ఉంటాయి. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ వేగం తగ్గడానికి కారణాలు ఇవే..

ప్రజలు ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్‌లలో 5జీ నెట్‌వర్క్‌లను ఆస్వాదిస్తున్నప్పటికీ, మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ వేగం సమస్య ఉంది. ఇదికాక కొన్నిసార్లు మన ఫోన్ కారణంగా ఇంటర్నెట్‌ వేగం తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు వీడియోలను ప్లే చేయడంలో, సోషల్ మీడియాను బ్రౌజ్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇందుకు చాలా రకాల కారణాలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ పాత సాఫ్ట్‌వేర్ నుంచి వేగాన్ని తగ్గించే బ్యాక్‌గ్రౌండ్ యాప్‌ల వరకు అనేక కారణాలు ఇంటర్నెట్ వేగాన్ని తగ్గిస్తాయి. అయితే, మీరు మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్ పనితీరును మెరుగుపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటినిన పాటించడం ద్వారా సులభంగా ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు.

ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి.. కాలక్రమేణా, మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ బగ్‌లను అభివృద్ధి చేయవచ్చు. అది వేగాన్ని తగ్గిస్తుంది. ఫోన్ సాఫ్ట్‌వేర్ నిరంతరం పని చేస్తున్నప్పటికీ, అది పాడైపోతుంది. సాఫ్ట్‌వేర్‌ను రిఫ్రెష్ చేయడానికి మీరు మీ ఫోన్‌ను రీస్టార్ట్ చేయొచ్చు.

బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయండి.. చాలా సార్లు, మీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్‌లు రన్ అవుతూ ఉంటాయి. ఇది మీ ఫోన్‌ డేటాను భారీగా వినియోగించడమే కాకుండా ఇంటర్నెట్‌ వేగాన్ని కూడా తగ్గిస్తుంది. డేటాను సేవ్ చేయడానికి, మీ ఇంటర్నెట్ వేగాన్ని పెంచడానికి, మీరు ఉపయోగించని యాప్‌లను క్లోజ్ చేయండి.

యాడ్ బ్లాకర్లను వాడండి.. చిత్రాలు, లింక్‌లు వంటి అనేక రకాల ప్రకటన పాప్-అప్‌లు స్మార్ట్‌ఫోన్‌లలో కనిపిస్తూనే ఉంటాయి. దీని కారణంగా మీ స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగించబడుతుంది. ఇంటర్నెట్ వేగం మందగిస్తుంది. మీరు ఈ ప్రకటనలను బ్లాక్ చేయడానికి యాడ్ బ్లాకర్ యాప్‌లను ఉపయోగించవచ్చు. మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక రకాల యాడ్ బ్లాకర్ యాప్‌లు అందుబాటులో ఉంటాయి. వాటి నుంచి మీరు ఉత్తమమైనదాన్ని ఎంచుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌.. మీ చుట్టూ ఉన్న నెట్‌వర్క్ బలంగా ఉన్నప్పటికీ, పాత సాఫ్ట్‌వేర్ కారణంగా ఇంటర్నెట్ పనితీరు పేలవంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, మీరు ఎల్లప్పుడూ సాఫ్ట్‌వేర్ లేదా అప్లికేషన్ అప్‌డేట్‌లను గమనిస్తూ ఉండాలి. మెరుగైన పనితీరు కోసం వాటిని వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోవాలి

వేరొక నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయండి.. మీ ప్రస్తుత నెట్‌వర్క్ నెమ్మదిగా ఉందని భావిస్తే.. పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్ లేదా సెల్యులార్ నెట్‌వర్క్ వంటి వేరే నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ ఫోన్ లేదా మీ నెట్‌వర్క్‌లో సమస్య ఉందో లేదో గుర్తించడంలో మీకు సహాయపడుతుంది.

కాష్, కుకీలను క్లియర్ చేయండి.. కాలక్రమేణా, మీ ఫోన్ యాప్‌ల నుంచి డేటాను సేకరిస్తూనే ఉంటుంది. ఇది మీ నెట్‌వర్క్‌ను ప్రభావితం చేస్తుంది. ఇంటర్నెట్ వేగాన్ని తగ్గిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు మీ ఫోన్ లోని కాష్, కుక్కీలను క్లియర్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటర్నెట్ పనితీరు మెరుగుపడుతుంది. దీన్ని చేయడానికి ఫోన్ సెట్టింగ్‌లోకి వెళ్లి యాప్‌లు అండ్ నోటిఫికేషన్‌లపై క్లిక్ చేసి, అన్ని యాప్‌లను చూడండి. తర్వాత ఒక యాప్‌పై నొక్కి, స్టోరేజ్ అండ్ కాష్‌కి వెళ్లండి.. ఆ కాష్‌ను క్లియర్ చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..