Phone Recharge Plans: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్..అద్బుతమైన ప్లాన్స్..అన్ లిమిటెడ్ కాల్స్..వివరాలివే
మూడు నెలల రీచార్జ్ ప్లాన్స్ వల్ల గడవు తీరిపోయాక సేవలు నిలిచిపోతున్నాయని, ఓ సంవత్సరం పాటు సేవలందించే ప్లాన్స్ ఏం ఉన్నాయి? అని కొందరు వినియోగదారులు సెర్చ్ చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వారి కోసం టాప్ టెలికాం కంపెనీలు 2023 న్యూ ఇయర్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చాయి.

ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్ హవా నడుస్తుంది. టెలికాం రంగంలో జియో రాకతో సంచలనాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని నెట్ వర్క్ లు కస్టమర్లకు అన్ లిమిటెడ్ సేవలు అందిస్తున్నాయి. అయితే నెలా..రెండు నెలలు..మూడు నెలల రీచార్జ్ ప్లాన్స్ వల్ల గడవు తీరిపోయాక సేవలు నిలిచిపోతున్నాయని, ఓ సంవత్సరం పాటు సేవలందించే ప్లాన్స్ ఏం ఉన్నాయి? అని కొందరు వినియోగదారులు సెర్చ్ చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వారి కోసం టాప్ టెలికాం కంపెనీలు 2023 న్యూ ఇయర్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చాయి. వార్షిక ప్లాన్స్ లో వ్యాలిడిటీ వివిధ రకాలుగా ఉన్నాయి. అలాగే వివిధ ఓటీటీ సబ్స్ స్క్రిప్షన్ కు ఉచితంగా ఆఫర్ చేస్తున్నాయి. కస్టమర్లకు జియో, ఎయిర్ టెల్, వీఐ ఎలాంటి వార్షిక ప్లాన్స్ అందిస్తున్నాయో ఓసారి చూద్దాం.
జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ లు
రూ.2545 ప్లాన్ : ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు. అలాగే ప్రతి రోజూ 1.5 జీబీ డేటా లెక్కన 504 జీబీ డేటా వస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పంపుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఈ ప్లాన్ కస్టమర్లు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్కురిటీ, జియో క్లౌడ్ వంటి సేవలను కాంప్లిమెంటరీగా పొందుతారు.
రూ.2879 ప్లాన్ : ఈ ప్లాన్ లో వినియోగదారులు డైలీ 2 జీబీ డేటా లెక్కన 730 జీబీ డేటా పొందుతారు. అలాగే అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ వస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్ తో కూడా కస్టమర్లు జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్స్ స్క్రిప్షన్ ను పొందుతారు.




రూ.2999 ప్లాన్ : ఈ ప్లాన్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్. ఈ ప్లాన్ వినియోగదారులు 365 రోజులు+23 రోజులు వ్యాలిడిటీ ఇస్తుంది. అలాగే డైలీ 2.5 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్+డైలీ 100 ఎస్ఎంఎస్ లను పంపుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా వస్తుంది.
ఎయిర్ టెల్ ప్లాన్స్
రూ.3599 ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు డైలీ 2.5 జీబీ డేటా పొందుతారు. అలాగే అన్ లిమిటెడ్ కాల్స్+100 ఎస్ఎంఎస్ వస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్ స్క్రిప్షన్ పొందుతారు. అలాగే అపోలో 24X7 సబ్స్ స్క్రిప్షన్ తో పాటు ఉచిత హలో ట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ యాక్సెస్ ఉంది.
రూ.2999 ప్లాన్ : ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. అలాగే డైలీ 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు పంపుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకుంటే అపోలో 24X7 సబ్స్ స్క్రిప్షన్ తో పాటు ఉచిత హలో ట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ యాక్సెస్ ఉంటుంది.
రూ.1799 ప్లాన్ : ఈ ప్లాన్ లో అపరమిత కాలింగ్ సదుపాయం 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అలాగే వినియోగదారులు 3600 ఎస్ఎంఎస్, 24 జీబీ డేటాను కూడా పొందుతారు. సెకండరీ సిమ్ గా ఎయిర్ టెల్ ఉన్న వినియోగదారులకు ఈ ప్లాన్ మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది.
వొడాఫోన్, ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్స్
రూ.3099 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజుల చెల్లుబాటుతో డైలీ 2 జీబీ డేటాతో వస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 100 ఎస్ఎంఎస్ వస్తాయి. వారాంతపు డేటా రోల్ఓవర్, వీఐ సినిమాలు, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్ స్క్రిప్షన్ తో పాటు అదనంగా 75 జీబీ డేటా వస్తుంది.
రూ.2899 ప్లాన్ : ఈ ప్లాన్ తో రోజు వారీ డేటా 1.5 జీబీ వస్తుంది. అపరిమిత కాల్స్ తో పాటు 100 ఎస్ఎంఎస్ వస్తాయి. అలాగే ఈ ప్లాన్ తో కూడా వారాంతపు డేటా రోల్ ఓవర్, బింగే ఆల్ నైట్, వీఐ సినిమాలు వంటి సదుపాయాలు ఉన్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..