Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Safety: మీ ఫోన్‌ను భద్రంగా ఉంచే సీక్రెట్ కోడ్స్.. నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చినవి.. చెక్ చేసుకోండి..

మన ఫోన్ ను భద్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. దానిలోని సమాచారం ఎవరికీ చేరకుండా కాపాడుకోవడం ముఖ్యం. అందుకే నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మీ స్మార్ట్ ఫోన్ ను రక్షించడానికి కొన్ని కోడ్లను అందిస్తోంది. వాస్తవానికి నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది ఒక స్వతంత్ర నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్జీఓ). ఈ సంస్థ తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో మీ ఫోన్లన భద్రంగా ఏడు సీక్రెట్ కోడ్లను షేర్ చేసింది.

Phone Safety: మీ ఫోన్‌ను భద్రంగా ఉంచే సీక్రెట్ కోడ్స్.. నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చినవి.. చెక్ చేసుకోండి..
Phone Security
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 07, 2023 | 9:05 PM

ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో మనం ఉన్నాం. వ్యక్తిగత సమాచారంతో పాటు, మనకు సంబంధించిన సమస్తం మన స్మార్ట్ ఫోన్లలోనే నిక్షిప్తమవుతోంది. మనం వాడే యాప్స్, వాటి పాస్ వర్డ్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇలా సమస్తం స్మార్ట్ ఫోన్లోనే ఉంటాయి. అటువంటి ఫోన్ హ్యాక్ అయినా, చోరీకి గురైనా.. మన భద్రతకు భంగం వాటిల్లుతుంది. అలాగే కొన్ని అసాంఘిక శక్తులు మన ఫోన్లను మనకు తెలియకుండానే హ్యాక్ చేసేసి వాటి ద్వారా మన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఫోన్ ను భద్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. దానిలోని సమాచారం ఎవరికీ చేరకుండా కాపాడుకోవడం ముఖ్యం. అందుకే నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎన్సీఐబీ) మీ స్మార్ట్ ఫోన్ ను రక్షించడానికి కొన్ని కోడ్లను అందిస్తోంది. వాస్తవానికి నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది ఒక స్వతంత్ర నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్జీఓ). ఈ సంస్థ తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో మీ ఫోన్లన భద్రంగా ఏడు సీక్రెట్ కోడ్లను షేర్ చేసింది. దానిలో ప్రతి స్మార్ట్ ఫోన్ వినియోగదారుడు కూడా ఈ కోడ్ ల గురించి తెలుసుకోవాలని కోట్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆ కోడ్లు ఇవే..

  • *#21#: ఈ రహస్య కోడ్ సహాయంతో, మీ కాల్, డేటా లేదా నంబర్ ఏదైనా ఇతర నంబర్‌కి ఫార్వార్డ్ చేయబడిందో లేదో తెలుసుకోవచ్చు.
  • #0#: ఈ సీక్రెట్ కోడ్ సహాయంతో, మీ ఫోన్ డిస్‌ప్లే, స్పీకర్, కెమెరా, సెన్సార్ సరిగ్గా పని చేస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చు.
  • * #07#: ఈ రహస్య కోడ్ మీ ఫోన్ ఎస్ఏఆర్ విలువను తెలియజేస్తుంది. అంటే దీని సహాయంతో మీరు ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. ఈ రేడియేషన్ విలువ ఎల్లప్పుడూ 1.6 కంటే తక్కువగా ఉండాలి.
  • *#06 #: ఈ రహస్య కోడ్ సహాయంతో మీరు మీ ఐఎంఈఐ నంబర్‌ను కనుగొనవచ్చు. ఫోన్ పోయినట్లయితే ఈ ఐఎంఈఐ నంబర్ అవసరం.
  • ## 4636##: మీరు ఈ రహస్య కోడ్‌తో మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ, ఇంటర్నెట్, వైఫై గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
  • ## 34971539##: ఈ రహస్య కోడ్‌తో మీరు మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మీ కెమెరా సరిగ్గా పనిచేస్తుందో లేదో కూడా మీరు తెలుసుకోవచ్చు.
  • 2767*3855# : మీరు మీ డయల్ ప్యాడ్‌లో ఈ రహస్య కోడ్‌ని టైప్ చేస్తే, అది మీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేస్తుంది. అయితే ఇలా రీసెట్ చేసిన తర్వాత ఫోన్ డేటా పోతుందని గుర్తుంచుకోండి. అందువల్ల, డేటాను ఎక్కడైనా సేవ్ చేసి, ఆపై ఈ కోడ్ డయల్ చేయాలి.

వినియోగదారుల ఫీడ్ ఇలా..

అయితే ఈ కోడ్లు వినియోగించిన ప్రజలు వీటిల్లో చాలా తక్కువ సీక్రెట్ కోడ్లు మాత్రమ పని చేస్తున్నాయని, మిగిలిన కోడ్లు ఎర్రర్ వస్తున్నాయని ఎన్సీఐబీ ట్విట్ కింద కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిని షేర్ చేస్తున్నారు. కొన్ని కోడ్లు మాత్రమే పనిచేస్తున్నాయని ఓ వినియోగదారుడు కామెంట్ చేస్తే.. ఐఎంఈఐ తప్ప మరేఇతర కోడ్ కూడా పనిచేయడం లేదని మరొకరు రాశారు. 2, 5, 6 కోడ్లలో ఏ లోపం లేదని.. మిగిలినవి పని చేయడం లేదని మరొకరు కామెంట్ చేశారు. ఇలా వినియోగదారులు ఎన్సీబీఐ పోస్ట్ కింద కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరోసారి విఫలమైన హైదరాబాద్ బ్యాటర్లు.. ప్లే ఆఫ్స్ కష్టమేగా?
మరోసారి విఫలమైన హైదరాబాద్ బ్యాటర్లు.. ప్లే ఆఫ్స్ కష్టమేగా?
బంగ్లా క్రికెట్ ఐకాన్‌కు షాక్.. 7 కేసుల్లో చిక్కుకున్న షకీబ్!
బంగ్లా క్రికెట్ ఐకాన్‌కు షాక్.. 7 కేసుల్లో చిక్కుకున్న షకీబ్!
'అలేఖ్య చిట్టి పికిల్స్' ఇష్యూపై అన్వేష్ రియాక్షన్.. వీడియో
'అలేఖ్య చిట్టి పికిల్స్' ఇష్యూపై అన్వేష్ రియాక్షన్.. వీడియో
రోజుకు 11 నిమిషాల నడక ఆరోగ్య రహస్యం మీకు తెలుసా..?
రోజుకు 11 నిమిషాల నడక ఆరోగ్య రహస్యం మీకు తెలుసా..?
హైదరాబాద్ పాలిట విలన్‌.. కట్‌చేస్తే.. సెంచరీతో నంబర్ 1గా సిరాజ్
హైదరాబాద్ పాలిట విలన్‌.. కట్‌చేస్తే.. సెంచరీతో నంబర్ 1గా సిరాజ్
బరువు తగ్గాలనుకుంటున్నారా.. బెస్ట్‌ టిప్స్‌ మీకోసం..!
బరువు తగ్గాలనుకుంటున్నారా.. బెస్ట్‌ టిప్స్‌ మీకోసం..!
మీరూ పుచ్చకాయ తినేసి గింజలు విసిరేస్తున్నారా? ఆగండాగండీ..
మీరూ పుచ్చకాయ తినేసి గింజలు విసిరేస్తున్నారా? ఆగండాగండీ..
హార్ట్ హెల్త్ కోసం ఉదయాన్నే తినాల్సిన 4 సూపర్ ఫుడ్‌లు..!
హార్ట్ హెల్త్ కోసం ఉదయాన్నే తినాల్సిన 4 సూపర్ ఫుడ్‌లు..!
రిటైర్మెంట్‌‌పై మౌనం వీడిన మిస్టర్ కూల్.. ఏమన్నాడంటే?
రిటైర్మెంట్‌‌పై మౌనం వీడిన మిస్టర్ కూల్.. ఏమన్నాడంటే?
సౌత్ ఇండియాలో ఎవ్వరికీ తెలియని అతి సుందరమైన హిల్ స్టేషన్స్ ఇవే!
సౌత్ ఇండియాలో ఎవ్వరికీ తెలియని అతి సుందరమైన హిల్ స్టేషన్స్ ఇవే!