Smart TVs: ఈ స్మార్ట్ టీవీలతో ఇంటికి అందం.. కంటికి వినోదం.. అమెజాన్ లో భారీ డిస్కౌంట్
ఇంటికి అందం తీసుకురావడంతో పాటు చక్కని వినోదం కావాలనుకుంటే 65 అంగుళాల స్టార్ టీవీని తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. నేడు మార్కెట్ లోని అనేక ఉత్తమ ఫీచర్లతో వివిధ రకాల మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఇంటిలోనే టీవీ చూస్తూ థియేటర్ లో ఉన్న అనుభూతిని పొందవచ్చు. సినిమాలు చూస్తున్నా, వినోద కార్యక్రమాలు వీక్షిస్తున్నా, స్నేహితులతో హై యాక్షన్ గేమ్ లు ఆడుతున్నా మీకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. క్రిస్టల్ క్లియర్ క్లారిటీ, స్మూత్ మోషన్ ప్రాసెసింగ్, బెస్ట్ కాంట్రాస్ట్ లతో విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫాం అమెజాన్ లో అతి తక్కువ ధరలకే 65 అంగుళాల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Apr 05, 2025 | 3:47 PM

దేశంలోని అత్యుత్తమ 65 అంగుళాల టీవీలలో హైయర్ ఒకటి. వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది. బ్లూటూత్, యూఎస్ బీ, వైఫై, క్రోమ్ కాస్ట్ తో పాటు వివిధ స్మార్ కనెక్టివిటీ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. హెచ్ డీఆర్ 10, హెచ్ఎల్జీ ఫీచర్లతో సినిమాటిక్ అనుభవాన్ని కలిగిస్తుంది. డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో అత్యుత్తమ ఆడియో వెలువడుతుంది. 2 జీ బీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ కలిగిన హైయర్ 65 అంగుళాల టీవీ అమెజాన్ లో రూ.61,990కి అందుబాటులో ఉంది.

అత్యుత్తమ 65 అంగుళాల టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి హైసెన్స్ ఈ6ఎన్ సిరీస్ టీవీ మంచి ఎంపిక. దీనిలోని 4కే ఏఐ అప్ స్కేలర్ ఫీచర్ ద్వారా క్లాసిక్, హోమ్ సినిమాలనే కాకుండా ఆధునిక సిరీస్ లను కూడా మంచి నాణ్యతతో చూడవచ్చు. అడాప్టివ్ లైట్ సెన్సార్ తో కాంతి పరిసర పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అవుతుంది. ఏఐ స్పోర్ట్స్ మోడ్ తో ప్రతి గేమ్ ను చక్కగా ఆస్వాదించవచ్చు. వివిధ కనెక్టివిటీ ఎంపికలు, రిమోట్ వాయిస్ కంట్రోల్, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ లో ఈ టీవీ రూ.46,999కి అందుబాటులో ఉంది.

ఎల్జీ 65 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలో ప్రతి సన్నివేశాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఇది ఏ5 ఏఐ ప్రాసెసర్ 4కే జెన్ 6 ద్వారా శక్తిని పొందుతుంది. 4కేలో కంటెంట్ చూడడం వల్ల ఇంట్లోనే థియేటర్ అనుభవం పొందవచ్చు. ఏఐ సౌండ్ స్పష్టత, బ్యాలెన్స్ నియంత్రణ కోసం 5.1 సరౌండ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. స్టార్ట్ అసిస్టెన్స్, కనెక్టివిటీ,ఏఏఏ గేమింగ్ ఫీచర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు కారణంగా మోషన్ బ్లర్ లేకుండా చక్కగా కార్యక్రమాలను వీక్షించవచ్చు. అమెజాన్ లో రూ.62,990కి ఈ టీవీ అందుబాటులో ఉంది.

సామ్సంగ్ నుంచి విడుదలైన 65 అంగుళాల ఎల్ఈడీ 4కే స్మార్ట్ టీవీలోని అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ తో విజువల్స్ చాలా బాగుంటాయి. క్రిస్టల్ ప్రాసెసర్ 4కే ఆధారితమైన ఈ టీవీలోని యూహెచ్ డీ డిమ్మింగ్, 4కే అప్ స్కేలింగ్..చిత్ర నాణ్యతను మరింత మెరుగుపరుస్తాయి. స్క్రీన్ పై ప్రతి అక్షరం చక్కని రంగులతో కనిపిస్తుంది. బిక్సీ, యాపిల్ ఎయిర్ ప్లే వంటి స్మార్ట్ ఫీచర్లు, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి వాటికి యాక్సెస్, క్యూ సింపోనీతో కూడిన 20 డబ్ల్యూ స్పీకర్లు, మంచి డిజైన్, వాయిస్ అసిస్టెంట్ అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ లో రూ.65,990కి ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.

సోనీ బ్రావియా 65 అంగుళాల స్మార్ట్ టీవీలో ఎక్స్ 14కే ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. లేటెస్ట్ అల్గారిథమ్ లతో అదనపు శబ్దాలు తగ్గిపోయి, ఆడియో చాలా స్పష్టంగా ఉంటుంది. మంచి రంగులు, కాంట్రాస్ట్ లతో క్వాలిటీ అత్యుత్తమంగా కనిపిస్తుంది. మోషన్ ఫ్లో ఎక్స్ఆర్ టెక్నాలజీతో వేగంగా కదిలే సన్నివేశాలలో కూడా విజువల్ చాలా బాగుంటుంది. అత్యుత్తమ ధ్వని నాణ్యత, ఒక్క క్లిక్ తో గూగుల్ అసిస్టెంట్, డాల్బీ ఆడియో, బాఫిల్ స్పీకర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ టీవీ అమెజాన్ లో తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.





























