Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

POCO C71: మార్కెట్‌లో మరో నయా ఫోన్ లాంచ్ చేసిన పోకో.. రెండు రోజుల్లో సేల్ స్టార్ట్..!

భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్స్ ఉండాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మధ్య తరగతి ప్రజలు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ పోకో సీ71 పేరుతో బడ్జెట్ ప్రియులను టార్గెట్ చేస్తూ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.

POCO C71: మార్కెట్‌లో మరో నయా ఫోన్ లాంచ్ చేసిన పోకో.. రెండు రోజుల్లో సేల్ స్టార్ట్..!
Poco C71
Follow us
Srinu

|

Updated on: Apr 06, 2025 | 2:30 PM

భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్‌కు ఉన్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని పోకో కంపెనీ సీ71ను ఇటీవల మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అనిన  నిపుణులు చెబుతున్నారు. కేవలం రూ.6499కే అందించే ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. చాలా సంవత్సరాలుగా అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే ప్రత్యేకంగా అందిస్తున్నారు. అయితే ఇటీవల మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్స్‌లో కూడా అందించే ఈ డిస్‌ప్లే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్‌కు అందించడం ఇదే ప్రథమం. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కారణంగా యాప్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు, గేమ్‌లు ఆడుతున్నప్పుడు లేదా ఫోన్‌ను నావిగేట్ చేస్తున్నప్పుడు చాలా సున్నితమైన అనుభవాన్ని పొందవచ్చు. అలాగే 6.88 అంగుళాల హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, 240 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌‌తో ఈ ఫోన్ తన ప్రత్యేకతను చాటుకుంటుందని పోకో కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

పోకో సీ71 ఫోన్ ఆండ్రాయిడ్ 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వస్తుంది. అలాగే రెండు సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లు అందిస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా  వెట్ టచ్ టెక్నాలజీతో లాంచ్ చేయడంతో వినియోగదారలు తడి చేతులతో కూడా ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. అలాగే ఈ ఫోన్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం ఐపీ52 రేటింగ్‌తో కూడా వస్తుంది. ఈ ఫోన్ యూనీసాక్ టీ7250 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 6 జీబీ +128 జీబీ వేరియంట్‌లో లభించనుంది. అలాగే 12 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ సదుపాయంతో పాటు మైక్రో ఎస్‌డీ ద్వారా 2 టీబీ వరకు విస్తరించవచ్చు.

పోకో సీ-71 కెమెరాల విషయానికొస్తే 32 మెగాపిక్సెల్ డ్యూయల్-రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ కారణంగా ఒక రోజంతా ఈ ఫోన్‌ను సులభంగా వాడుకోవచ్చు. అయితే 15 వాట్స్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతగా ఉంటుంది. కనెక్టివిటీ వారీగాఈ ఫోన్ 4జీ డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ-సీ పోర్ట్‌తో వస్తుంది. పోకో సీ 71 ఏప్రిల్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,499, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా ఉంది. అయితే ఎయిర్‌టెల్ వినియోగదారులు ఏప్రిల్ 10 నుండి రూ.5,999 ప్రారంభ ధరకు ఈ పరికరాన్ని కొనుగోలు చేయవచ్చు. పోకో సీ 71 ఫోన్ నలుపు, నీలం, గోల్డ్ కలర్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి