AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్బుత ఫీచర్లు, తక్కువ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్… త్వరలోనే భారత్‌లోకి..

నథింగ్ త్వరలో తక్కువ ధర, అత్యాధునిక ఫీచర్లతో కూడిన 4A వెర్షన్ ఫోన్ విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ బీఐఎస్‌లో లిస్ట్ కావడంతో.. దీనికి సంబంధించిన వివరాలు బయటకు లీక్ అయ్యాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది.

అద్బుత ఫీచర్లు, తక్కువ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్... త్వరలోనే భారత్‌లోకి..
Nothing 4a
Venkatrao Lella
|

Updated on: Nov 22, 2025 | 6:31 PM

Share

Nothing Phone 4a: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కలిగిన ఫోన్ కొనుగోలు చేయలనుకునేవారికి గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ తక్కువ బడ్జెట్‌లో త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తుంది. నథింగ్ 4A పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. నథింగ్ 3ఏ ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఇది వస్తోంది. అసలు ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్లు ఇవే

-120Hz రిఫ్రెష్ రేట్‌

-6.82-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే

-పాండా గ్లాస్ ప్రొటెక్షన్

-స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌

-64MP మెయిన్ కెమెరా

-50MP టెలిఫోటో లెన్స్

-8MP అల్ట్రావైడ్ షూటర్ -సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా

-వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌

-ఆండ్రాయిడ్ 16

-50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ -8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్

బీఐఎస్ సర్టిఫికేషన్ డీటైల్స్ ప్రకారం ఈ ఫోన్ వచ్చే ఏడాది జనవరిలో విడుదలయ్యే అవకాశముంది. 8GB RAM + 128GB వేరియంట్‌తో ఈ రానున్న ఈ ఫోన్ ధర రూ.25 వేల నుంచి రూ.29 వేల వరకు ఉండొచ్చు. నథింగ్ 3ఏ ఫోన్ మార్చిలో ఇండియాలో లాంచ్ అయింది. దీని ధర రూ.22,999గా ఉంది. ఇది పాండా గ్లాస్ రక్షణతో 6.7-అంగుళాల AMOLED స్క్రీన్ కలిగి ఉంది.50W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి