Smartphone: సూపర్ స్టన్నింగ్ ఫీచర్స్‌తో రెండు నయా ఫోన్స్ లాంచ్.. వారే అసలు టార్గెట్
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్లను అధికంగా వినియోగిస్తున్నారు. ఎక్కువగా మధ్యతరగతి యువత తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో వచ్చే స్మార్ట్ ఫోన్లను ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారినే టార్గెట్ చేస్తూ ప్రముఖ కంపెనీ టెక్నో తన పోవా 7 సిరీస్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో పోవా 7 సిరీస్‌కు సంబంధించిన కీలక విషయాలను తెలుసుకుందాం.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ టెక్నో తన 5జీ స్మార్ట్‌ఫోన్లను పోవా 7, పోవా 7 ప్రోను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు వెనుక భాగంలో డైనమిక్ కొత్త డెల్టా లైట్ ఇంటర్‌ఫేస్‌తో 104 మినీ ఎల్ఈడీ లైట్‌లతో ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్, నోటిఫికేషన్‌లు, వాల్యూమ్, ఛార్జింగ్‌కు ప్రతిస్పందించే విధంగా రూపొందించారు. ఈ ఫోన్లు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నాయి. టెక్నో పోవా 7 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ. 14,999, 8 జీబీ + 256 జీబీ మోడల్ ధర రూ. 15,999గా ఉంది. ఈ ఫోన్ మ్యాజిక్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్, గీక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే టెక్నో పోవా 7 ప్రో 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర రూ. 18,999, 8 జీబీ + 256 జీబీ మోడల్ ధర రూ. 19,999గా ఉంది. ఈ ప్రో వేరియంట్ డైనమిక్ గ్రే, నియాన్ సియాన్, గీక్ బ్లాక్ రంగులలో లభిస్తుంది.
లాంచ్ ఆఫర్లలో భాగంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ప్రముఖ బ్యాంక్ కార్డులతో రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో వస్తాయి. జూలై 10 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లను కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రముఖ బ్యాంకుల నుండి 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. టెక్నో పోవా 7 సిరీస్ 6.78 అంగుళాల 144 హెచ్‌జెడ్ స్క్రీన్‌తో వస్తుంది. అలాగే ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. అయితే ప్రో మోడల్ 1.5కే ఎమోఎల్ఈడీ స్క్రీన్‌తో ఆకర్షిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 8 జీబీ ర్యామ్‌తో పాటు 8జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌కు సపోర్ట్ చేస్తాయి. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే పోవా 7 సెకండరీ కెమెరాతో పాటు 50 ఎంపీ బ్యాక్ కెమెరాతో వస్తుంది. అయితే పోవా 7 ప్రో అలాగే 8 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు సోనీ ఐఎంఎక్స్ 682 64 ఎంపీ బ్యాక్ కెమెరాతో వస్తుంది. ముందు భాగంలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 45 వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. అయితే టెక్నో పోవా 7 ప్రో 30 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15-ఆధారిత హెచ్ఐఓఎస్ 15 ఆధారంగా పని చేస్తాయి. ముఖ్యంగా భారతీయ భాషలకు మద్దతు ఇచ్చే ఎల్లా ఏఐ చాట్‌బాట్‌తో ఆకట్టుకుంటాయి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..