Phone Battery: 5G నెట్‌వర్క్ మీ ఫోన్ బ్యాటరీని దెబ్బతీస్తుందా? నిజం ఏంటి?
Phone Battery: ఇందులో వీడియో కీలక పాత్ర పోషిస్తుంది. 5G స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రా-హై డెఫినిషన్ (UHD) మోడ్‌లో వీడియోలను ప్రసారం చేయడం వల్ల 720p లేదా 1080p రిజల్యూషన్ కంటే ఫోన్ బ్యాటరీ వేగంగా ఖాళీ అవుతుంది. అధిక రిజల్యూషన్ డిస్‌ప్లేలు ఎక్కువ బ్యాటరీ..

Phone Battery: భారతదేశంలో మనం ఇప్పుడు 5G యుగంలో ఉన్నాము. హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌలభ్యం కోసం అందరూ 5G స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. కానీ 5G నెట్‌వర్క్‌లు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మీకు తెలుసా? 4G నుండి 5Gకి మారడం వల్ల మీ బ్యాటరీ ఎలా ప్రభావితమవుతుందో చూద్దాం. నిజానికి 5G నెట్‌వర్క్‌లు మీ బ్యాటరీని వేగంగా ఖాళీ చేస్తాయి. దీని అర్థం మీ ఫోన్ పూర్తిగా డెడ్ అవుతుందని కాదు, కానీ మీరు దానిని తరచుగా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Astrology: ఈ నెలలో పుట్టిన అమ్మాలు అందంలో అప్సరసలే.. కుర్రాళ్ళు పెళ్లంటూ చేసుకుంటే వీరినే చేసుకోవాలి..!
5G నెట్‌వర్క్ మీ బ్యాటరీకి హానికరమా?
టెలికాం టాక్ ప్రకారం.. 5G నెట్‌వర్క్‌లు సాధారణంగా 4G నెట్‌వర్క్‌ల కంటే ఎక్కువ పవర్‌ని వినియోగిస్తాయి. దీనివల్ల బ్యాటరీ వేగంగా ఖాళీ అవుతుంది. 2020 -2021 మధ్య విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే అనేక 5G చిప్‌సెట్‌లు పూర్తిగా ఆప్టిమైజ్ చేయకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి.
అంతే కాదు, 2022-2023లో తయారైన స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసిన 5G చిప్‌సెట్‌లతో ఓవర్ హీటింగ్ సమస్యలు ఉన్నాయి. దీని వలన బ్యాటరీ శక్తి త్వరగా పోతుంది. రాబోయే సంవత్సరాల్లో దీనిని పరిష్కరించి సరైన స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Ration Card: ఈ రూల్స్ పాటించాల్సిందే.. లేకుంటే రేషన్ కార్డు రద్దు..!
బ్యాటరీ లైఫ్ తగ్గుతుందా?
5G నెట్‌వర్క్‌లు ఇంకా అన్ని చోట్లా పూర్తిగా అందుబాటులో లేవు. అప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు తరచుగా 5G నుండి 4Gకి మారుతాయి. ముఖ్యంగా 5G సిగ్నల్స్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నెట్‌వర్క్ తరచుగా మారడం వల్ల బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. అలాగే 5G సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు, ఫోన్ పదే పదే సిగ్నల్‌ను కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియ బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తుంది.
మీ స్మార్ట్‌ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ మీ ఫోన్ బ్యాటరీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాఫ్ట్‌వేర్ సరిగ్గా అప్‌డేట్ చేయకపోతే అది 5G నెట్‌వర్క్‌లలో బ్యాటరీ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆపిల్ తన స్వంత 5G మోడెమ్‌ను కూడా విడుదల చేసింది. ఇది బ్యాటరీ వినియోగాన్ని తగ్గించడానికి రూపొందించింది. దీని వలన వినియోగదారులు మెరుగైన బ్యాటరీ జీవితాన్ని పొందవచ్చు. మొత్తంమీద సాఫ్ట్‌వేర్ సరిగ్ అప్‌డేట్ చేయకపోతే బ్యాటరీ వినియోగం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వరుసగా 3 రోజులు సెలవులు!
ఇందులో వీడియో కీలక పాత్ర పోషిస్తుంది. 5G స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రా-హై డెఫినిషన్ (UHD) మోడ్‌లో వీడియోలను ప్రసారం చేయడం వల్ల 720p లేదా 1080p రిజల్యూషన్ కంటే ఫోన్ బ్యాటరీ వేగంగా ఖాళీ అవుతుంది. అధిక రిజల్యూషన్ డిస్‌ప్లేలు ఎక్కువ బ్యాటరీ శక్తిని ఉపయోగిస్తాయి.
ఇది కూడా చదవండి: BSNL: కేవలం 319 రూపాయలకే 65 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








