Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: మీ స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా భూకంపాన్ని ముందుగానే గుర్తించొచ్చు.. ఈ సెట్టింగ్స్‌ చేయండి!

Tech News: మీ స్మార్ట్‌ఫోన్ సహాయంతో భూకంపం వల్ల కలిగే ఏదైనా విపత్తు నుండి మిమ్మల్ని, ఇతరులను మీరు రక్షించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లలో భూకంప హెచ్చరికలు ఉంటాయి. ఈ సౌకర్యం భూకంపం సమయంలో ప్రజలను హెచ్చరిస్తుంది. సిస్టమ్ ఆన్‌లో ఉంటే భూకంపం సంభవించే ముందు స్మార్ట్‌ఫోన్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది..

Tech News: మీ స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా భూకంపాన్ని ముందుగానే గుర్తించొచ్చు.. ఈ సెట్టింగ్స్‌ చేయండి!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 08, 2025 | 12:50 PM

ఇటీవలి రోజుల్లో రాష్ట్రంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. కొంతకాలంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా అనేక భూకంపాలు సంభవించాయి. కొన్నిసార్లు విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది. భూకంపాలు ఎప్పుడైనా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు మనం భూకంపాలను నిరోధించలేము కానీ, సాంకేతికత సహాయంతో ఈ విపత్తుల నుండి మనల్ని మనం ఖచ్చితంగా రక్షించుకోవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్ సహాయంతో భూకంపం వల్ల కలిగే ఏదైనా విపత్తు నుండి మిమ్మల్ని, ఇతరులను మీరు రక్షించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లలో భూకంప హెచ్చరికలు ఉంటాయి. ఈ సౌకర్యం భూకంపం సమయంలో ప్రజలను హెచ్చరించగలదు. సిస్టమ్ ఆన్‌లో ఉంటే భూకంపం సంభవించే ముందు స్మార్ట్‌ఫోన్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

చాలా స్మార్ట్‌ఫోన్‌లలో కదలిక సెన్సార్లు ఉంటాయి. ఈ సెన్సార్‌ను యాక్సిలెరోమీటర్ అంటారు. ఫోన్ సెన్సార్ స్వల్ప వైబ్రేషన్లను కూడా గుర్తించగలదు. ఒకే చోట ఎక్కువ ఫోన్‌లు ఒకేసారి వైబ్రేట్ అయినప్పుడు అది ఈ సమాచారాన్ని సెంట్రల్ సర్వర్‌కు పంపుతుంది. అప్పుడు సర్వర్ భూకంపం సంభవించిందా లేదా దాని తీవ్రత ఎంత అనేది గుర్తిస్తుంది. ఒకవేళ అలాంటి ప్రకంపనలు భూకంపం వల్ల సంభవించినట్లయితే సర్వర్ ప్రభావిత ప్రాంతంలోని ప్రజలకు హెచ్చరికను పంపుతుంది. అయితే ఇది అన్ని ఫోన్ లో ఉండకపోవచ్చు. మీ ఫోన్ మోడల్ నుబట్టి ఉంటుందని గుర్తించుకోండి. మొబైల్ తయారీ కంపెనీలు చాలా ఫోన్లలో ఈ ఆప్షన్ అందించింది.

మిమ్మల్ని, ఇతరులను సురక్షితంగా ఉంచుకోవడానికి మీకు కొంత సమయం ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో భూకంప హెచ్చరికలు పనిచేయడానికి కొన్ని విధానాలు అనుసరించాలి. ఆండ్రాయిడ్ వినియోగదారులు ముందుగా ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి ‘సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ’ పై క్లిక్ చేయాలి. తరువాత ‘భూకంప హెచ్చరిక’ ఆన్ చేయండి.

మరోవైపు ఐఫోన్ వినియోగదారులు ముందుగా సెట్టింగ్‌లకు వెళ్లి ‘నోటిఫికేషన్’ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి ‘ఎమర్జెన్సీ అలర్ట్’ ఆన్ చేయండి. గూగుల్ ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 2023లో ఈ వ్యవస్థను భారతదేశానికి విస్తరించారు. ఈ వ్యవస్థ ఆండ్రాయిడ్ ఫోన్‌ను చిన్న భూకంప డిటెక్టర్‌గా మారుస్తుంది. ఫోన్‌లోని యాక్సిలరోమీటర్ నేలపై కంపనాలను గుర్తిస్తుంది. ఈ సమాచారం Google భూకంప గుర్తింపు సర్వర్‌కు పంపుతుంది. అందువల్ల సాధారణ స్మార్ట్‌ఫోన్ సాధ్యమయ్యే ప్రమాదంలో రక్షకుడిగా మారవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి