AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TCL Smart Glasses: మాయా కళ్లద్దాలు! మరో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ ఖాయం.. ఫీచర్లు మామూలుగా లేవు..

ఇది సాధారణ గ్లాస్ కాదు.. త్రీడీ గ్లాసెస్ కూడా కాదు.. అంతకుమించి అనేట్లు ఉంది. దీనిలో ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. దీనిని ఇటీవల లాస్ వేగాస్ లోని కస్యూమర్ ఎలక్ట్రానిక్ షో(సీఈఎస్)లో రేనియో ఎక్స్2(TCL Ray Neo X2) పేరిట టీసీఎల్ ప్రదర్శించింది.

TCL Smart Glasses: మాయా కళ్లద్దాలు! మరో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ ఖాయం.. ఫీచర్లు మామూలుగా లేవు..
TCL Rayneo AR Glasses
Madhu
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 08, 2023 | 5:38 PM

Share

త్రీడీ కళ్లద్దాలు మనలో చాలా మందికి తెలుసు. ఏదైనా త్రీడీ సినిమాను చూడటానికి సినిమా థియేటర్ కు వెళ్తే వారు ఒక కళ్లజోడు మనకు ఇస్తారు. వాటిని పెట్టుకోవడం ద్వారా మనం త్రీడీ అనుభూతిని పొందగలుగుతాం. అయితే అచ్చం అలాంటి గ్లాసెస్ ను పోలి ఉండే స్మార్ట్ గ్లాసెస్ ను సరికొత్తగా టీసీఎల్(TCL) ఆవిష్కరించింది. ఇది సాధారణ గ్లాస్ కాదు.. త్రీడీ గ్లాసెస్ కూడా కాదు.. అంతకుమించి అనేట్లు ఉంది. దీనిలో ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. దీనిని ఇటీవల లాస్ వేగాస్ లోని కస్యూమర్ ఎలక్ట్రానిక్ షో(సీఈఎస్)లో రేనియో ఎక్స్2(TCL RayNeo X2) పేరిట టీసీఎల్ ప్రదర్శించింది. దీని వివరాలు ఇప్పుడు చూద్దాం..

చాలా స్మార్ట్ గురూ..

చైనాకు చెందిన టీవీల తయారీ కంపెనీ టీసీఎల్ సరికొత్త రేనియో ఎక్స్2 ను పేరిట కళ్ల అద్దాలను ఆవిష్కరించింది. ఇది సినిమా థియేటర్ త్రీడీ సినిమాను తిలకించేందుకు వినయోగించే గ్లాసెస్ ను పోలి ఉంటుంది. అంతకు మించిన స్మార్ట్ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

రోజువారీ వాడొచ్చు..

ఈ రేనియో ఎక్స్2 అద్దాలను రోజువారీ మీరు వాడే కళ్లద్దాల మాదిరిగానే వినియోగించవచ్చు. దీనిలో అత్యాధునిక సాంకేతికత ద్వారా మీకు అవసరమైన జీవీస్ నావిగేషన్, ఆటో ట్రాన్స్ లేషన్, ఫోన్ కాల్స్, మెసేజ్లను ఫోన్ నుంచి కాకుండా నేరుగా ఈ కళ్లద్దాల నుంచి చూడొచ్చు. దీనిలో మైక్రో ఎల్ఈడీ డిస్ ప్లే మీ కళ్ల ముందు వాటిని ప్రొజెక్ట్ చేస్తుంది. అలాగే ఈ స్క్రీన్ పైనే వీడియోలు కూడా చూడొచ్చు, పాటలూ వినొచ్చు.

ఇవి కూడా చదవండి

ఎలా అంటే..

మీకు ఇది బాగా అర్థం కావాలంటే ఈ ఉదాహరణ చూడండి.. మీకు సమీపంలోని ఓ లైబ్రెరీ అడ్రస్ కావాలను కోండి.. ఏం చేస్తారు? ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ లో సెర్చ్ చేసి జీపీఎస్ ఆధారంగా టార్గెటెడ్ స్పాట్ కు వెళ్లిపోతారు. కానీ ఈ కళ్లజోడు పెట్టుకుంటే మీకు ఫోన్ తో పనిలేదు. కళ్లముందు ఎల్ఈడీ స్క్రీన్ పై నావిగేషన్ కనిపిస్తుంది. ఎంచక్కా అందులో చూసుకుంటూ వెళ్లిపోవచ్చు. అలాగే ఇందులో ఉన్న మరో ఫీచర్ ఆటో ట్రాన్స్ లేషన్.. మీకు రాని వేరే భాష మాట్లాడుతున్న వ్యక్తితో మీరు సంభాషించాల్సి వస్తే ఇది అప్పటికప్పుడు అది ఆ వ్యక్తి మాటలను ట్రాన్స్ లేట్ చేసి స్క్రీన్ పై ప్రొజెక్ట్ చేస్తుంది.

ప్రపంచంలోనే మొట్టమొదటిది..

టీసీఎల్ రేనియో ప్రపంచలోనే మొట్టమొదటి బైనాక్యూలర్ ఫుల్ కలర్ మైక్రో ఎల్ఈడీ ఆప్టికల్ ఏఆర్ కలిగిన స్మార్ట్ గ్లాసెస్ అని ఆ సంస్థ సీఈవో హౌయి లీ చెప్పారు. ఇది సైలిష్ గా ఉండటంతో పాటు చాలా సులభంగా వినియోగించుకోవచ్చని వివరించారు. ఇది కళ్లకు పెట్టుకునే మరిన్ని కొత్త ఇన్ వెన్షన్లకు నాంది పలుకుతుందన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..