Knowledge: CT స్కాన్‌, MRI ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?

మారుతోన్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో సమూలమైన మార్పులు వచ్చాయి. ప్రతీ రంగంలో టెక్నాలజీ అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే వైద్య రంగంలోనూ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు జటిలంగా ఉండే ఎన్నో ఆరోగ్య సమస్యలకు టెక్నాలజీ పరిష్కారం చూపింది. ఇలా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీల్లో..

Knowledge: CT స్కాన్‌, MRI ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Ct Scan And Mri
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 08, 2023 | 4:55 PM

మారుతోన్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో సమూలమైన మార్పులు వచ్చాయి. ప్రతీ రంగంలో టెక్నాలజీ అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే వైద్య రంగంలోనూ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు జటిలంగా ఉండే ఎన్నో ఆరోగ్య సమస్యలకు టెక్నాలజీ పరిష్కారం చూపింది. ఇలా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీల్లో ఒకటి సీటీ స్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ. ఈ రెండు విధానాల ద్వారా మనిషి శరీరం లోపల వ్యాధిని గుర్తిస్తుంటారు. అయితే ఈ రెండు యంత్రాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే వీటి ఉపయోగాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇంతకీ CT స్కాన్‌, MRIలకు మధ్య ఉన్న తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరం లోపల విరిగిన ఎముకలను గుర్తించడానికి CT స్కాన్‌ను ఉపయోగిస్తుంటారు. దీంతో పాటు శరీరంలో ఏర్పడ్డ ట్యూమర్స్‌, క్యాన్సర్‌ కణాలు, ఇంటర్నల్‌గా జరిగిన రక్తస్త్రావాలు, ఇన్ఫెక్షన్స్‌ వంటి వాటిని గుర్తించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే శరీరం లోపల తీవ్రమైన వ్యాధులను గుర్తించడానికి CT స్కాన్‌ను ఉపయోగిస్తుంటారు. ఇక MRI విషయానికొస్తే.. వీటి ద్వారా మెదడు, మణికట్లు, ఛాతీ, గుండె, చీలమండ, కీళ్ల సమస్యలను గుర్తించడానికి ఉపయోగిస్తున్నారు. ఎమ్‌ఆర్‌ఐ మిషన్‌ పరీక్ష చేసే సమయంలో చాలా పెద్ద శబ్ధం చేస్తుంది. దీని ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఇక ఈ రెండు యంత్రాల మధ్య ఉన్న మరో ప్రధాన తేడా విషయానికొస్తే.. MRI రేడియో తరంగాల ఆధారంగా పనిచేస్తుంది. అదే CT స్కాన్‌ ఎక్స్‌రే కిరణాల ద్వారా పనిచేస్తుంది. సీటీ స్కాన్‌తో పోల్చితే ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ ధర ఎక్కువగా ఉంఉటంది. ఎక్స్‌రేలతో పనిచేస్తుంది కాబట్టి సీటీ స్కాన్‌ను గర్భిణీలకు ఎక్కువగా సూచించారు. ప్రపంచవ్యాప్తంగా సీటీ స్కాన్‌లే ఎక్కువగా జరుగుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..