Tech Tips: రాత్రుళ్లు పడుకునే ముందు వైఫై ఆఫ్‌ చేయడం లేదా.? పెద్ద ముప్పు తప్పదంటున్న నిపుణులు.

ప్రస్తుతం ఇంటర్‌నెట్ వినియోగం అనివార్యంగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్‌లు అందిరికీ అందుబాటులోకి రావడం, ఇంటర్‌నెట్ చార్జీలు సైతం తగ్గడంతో నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. అంతేకాకుండా బ్రాడ్ బ్యాండ్‌ వినియోగం కూడా ఇటీవల బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతీ ఇంట్లో వైఫైని ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌...

Tech Tips: రాత్రుళ్లు పడుకునే ముందు వైఫై ఆఫ్‌ చేయడం లేదా.? పెద్ద ముప్పు తప్పదంటున్న నిపుణులు.
Wifi Signals
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 08, 2023 | 5:48 PM

ప్రస్తుతం ఇంటర్‌నెట్ వినియోగం అనివార్యంగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్‌లు అందిరికీ అందుబాటులోకి రావడం, ఇంటర్‌నెట్ చార్జీలు సైతం తగ్గడంతో నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. అంతేకాకుండా బ్రాడ్ బ్యాండ్‌ వినియోగం కూడా ఇటీవల బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతీ ఇంట్లో వైఫైని ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌. దీంతో అవసరం ఉన్నా లేకున్నా వైఫై రూటర్స్‌ని ఆన్‌లోనే పెడుతున్నారు. అయితే ఇలా నిత్యం వైఫై ఆన్‌లోనే ఉంటే ఎన్నో రకాల సమస్యలు ఉంటాయని మీలో ఎంత మందికి తెలుసు.? నిత్యం వైఫై ఆన్‌లోనే ఉండడం వల్ల శరీరంపై పడే ప్రభావం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వైఫై సిగ్నల్స్‌ వల్ల నిద్రపై ప్రభావం పడుతుంది. దీర్ఘకాంలో ఇది నిద్రలేమికి కారణంగా మారొచ్చు.

* కొన్ని సందర్భాల్లో వైఫై సిగ్నల్స్‌ మానసికంగానూ ప్రభావం చూపుతాయి. మానసిక ఆరోగ్యంపై నెట్ సిగ్నల్‌ ఎఫెక్ట్ ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. చిరాకు, అసహనం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

ఇవి కూడా చదవండి

* ఇంటర్‌నెట్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనిషి జ్ఞాపక శక్తిపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఇది అల్జీ మర్స్‌ సమస్యకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

* ఇక ఇంటర్‌నెట్‌ను ఎక్కువగా ఉపయోగిండం శారీరక ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. శారీరక శ్రమ తగ్గడం, ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వల్ల ఊబకాయం సమస్య వేధిస్తుంది.

* ఈ సమస్యల నుంచి బయట పడాలంటే ఇంటర్‌నెట్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు పడుకునే సమయంలో వైఫై సిగ్నల్స్‌ని ఆఫ్‌ చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఫోన్‌ను వీలైనంత వరకు పడుకునే ప్రదేశానికి దూరంగా పెట్టుకోవాలి. ఫోన్‌లో కూడా ఇంటర్‌నెట్‌ను ఆఫ్‌ చేసుకోవాలని చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..