AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: భూమి చుట్టూ 129 శకలాలు.. ఢీకొడితే పెను ప్రమాదమే.. సంచలన విషయం వెలుగులోకి..

ఇస్రో ఆందోళనకర వార్తను బయటపెట్టింది. భూమి చుట్టూ 129 శకలాలు తిరుగుతున్నట్లు స్పష్టం చేసింది. ఉపగ్రహల నుంచి విడిపోయిన ఈ శకాలాల వల్ల భవిష్యత్తులో అంతరిక్షంలో ప్రమాదంలో ఏర్పడే అవకాశముంది. పనిచేసే ఉపగ్రహాలను ఢీకొనడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని ఇస్రో తెలిపింది.

ISRO: భూమి చుట్టూ 129 శకలాలు.. ఢీకొడితే పెను ప్రమాదమే.. సంచలన విషయం వెలుగులోకి..
Isro
Venkatrao Lella
|

Updated on: Mar 23, 2026 | 4:29 PM

Share

గత కొన్ని దశాబ్దాలుగా భారత్ అంతరిక్ష రంగంలో దినాభివృద్ది చెందుతోంది. అనేక ప్రయోగాలు చేపడుతూ ప్రపంచాన్ని ఆకర్షించడంతో పాటు పురోగతిని సాధిస్తోంది. ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించడం, నావిగేషన్, క్యూనినేషన్ వ్యవస్థలను విస్తరిస్తూ ప్రపంచంలోనే అంతరిక్ష ప్రయోగాల్లో ప్రధాన శక్తిగా అవతరిస్తోంది. అయితే కొన్ని అంతరిక్ష ప్రయోగాలు సజావుగా ముగిసే అవకాశం ఉండదు. అవసరం తీరాక భూమి చుట్టూ వాటి అవశేషాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. అందులో భాగంగా తాజాగా ఇస్రో వెల్లడించిన వివరాలతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది శాస్త్రవేత్తలను ఆందోళన కలిగించే విషయంగా చెప్పవచ్చు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తన స్థానాన్ని చాటుతున్నప్పటికీ… శిథిలాలు విషయం కాస్త ఆందోళన రేకెత్తిస్తోంది.

భూమి చుట్టూ 129 శిధిలాలు

ఇస్రో అధికారిక డేటా ప్రకారం.. ప్రస్తుతం భారతదేశ కక్ష్యలో భూమి చుట్టూ 129 అంతరిక్ష శిథిలాలు పరిభ్రమిస్తున్నాయి. వీటిల్లో 49 పనిచేయని ఉపగ్రహలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ ఉపగ్రహలు ప్రస్తుతం ఇనాక్టివ్ స్టేజ్‌లోకి వెళ్లాయి. దీంతో భూమికి సమీప కక్ష్యలో పరిభ్రమిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇక రాకెట్ భాగాలు, అంతరిక్ష శిథిలాలు, ప్రయోగాల తర్వాత మిలిగిపోయిన శిథిల శకాలు వీటిల్లో ఉన్నాయి. ఇక ఇవి ఢీకొనడం వల్ల ఏర్పడిన ముక్కలు, పాత ప్రయోగాల నుంచి విడిపోయిన భాగాలు కూడా వీటిల్లో ఉన్నట్లు ఇస్రో చెబుతోంది. పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ, ఎల్‌వీఎమ్ 3, పీఎస్‌ఎల్వీ సీ3 రాకెట్ల నుంచి విడిపోయి శకలాలు ఉన్నాయి. పీఎస్‌ఎల్వీ నుంచి విడిపోయిన 33 శకాలాలు ఉన్నాయి.

వీటి వల్ల ప్రమాదం

ఈ శకలాలు చిన్నవి అయినప్పటికీ.. ఇవి ప్రయాణించే వేగం కారణంగా ప్రమాద ముప్పును కలిగించే అవకాశాలున్నాయి. సుమారు సెకన్‌కు 10 కిలోమీటర్ల వేగంతో ఇవి కదలుతాయి. పనిచేస్తున్న ఉపగ్రహన్ని ఇవి ఢీకొడితే తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. పరస్పరం ఢీకొనడం వల్ల వేలాది కొత్త శిథిల భాగాలు కూడా ఏర్పడతాయి. ఇది కక్ష్యలో ప్రమాదాన్ని మరింత పెంచుతుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న శిథిలాలను తొలగించే ప్రక్రియకు కూడా పరిశోధకులు శ్రీకారం చుట్టారు. 2025లో స్పాడెక్స్ మిషన్‌లో డాకింగ్, అన్ డాకింగ్ టెక్నాలజీని ప్రదర్శించింది. ఇనాక్టివ్ అయిన ఉపగ్రహలను, శిధిలాలను పట్టుకోవడం వంటి భవిష్యత్ మిషన్లకు ఇది చాలా ముఖ్యమైనది. అంతరిక్ష వస్తువులను పర్యవేక్షించేందుకు ఈ ప్రాజెక్ట్ దోహడపడుతుంది. సాధ్యమైనంతగా ప్రమాదాలకు గురయ్యే ఈ శిధిలాలను ఏరివేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. వీటిని గుర్తించి శుభ్రపర్చడానికి ఇస్రో అనేక ప్రయత్నాలు చేస్తోంది.

Follow Us
ఇస్రో నుంచి షాకింగ్ న్యూస్.. భూమి చుట్టూ ఏకంగా 129 శకలాలు
ఇస్రో నుంచి షాకింగ్ న్యూస్.. భూమి చుట్టూ ఏకంగా 129 శకలాలు
అడుగు దూరంలో పాము ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఈ తప్పులు చేశారో..
అడుగు దూరంలో పాము ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఈ తప్పులు చేశారో..
తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా బంగారు పూతతో..
తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా బంగారు పూతతో..
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?