Solar Jet: నీరు, గాలి, సూర్యరశ్మితో పరుగులు తీయనున్న విమానాలు.. ఆసక్తి రేపుతున్న సరికొత్త ప్రయోగాలు..
వాతావరణ మార్పులకు కారణమవుతున్న గ్లోబల్ ఆంత్రోపోజెనిక్ ఉద్గారాలలో దాదాపు 5 శాతం వాటా విమానయాన రంగందేనని ఒక అంచనా.. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అనే దిశగా జరుగుతున్న పరిశోధనలు పురోగతిని సాధిస్తున్నాయి.
Solar-powered reactor: విమానాలు నడిచేందుకు ఎయిర్ ఆవియేషన్ ప్యూయెల్ అవసరం.. విమానాలను నడిపేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈ ఇంధనం ఎక్కువగా ముడి చమురు నుంచి తీసిన కిరోసిన్ ఆధారంగా తయారు చేస్తారు. విమానాలను నడిపించేందుకు అవసరమయ్యే ఈ ద్రవ హైడ్రోకార్బన్ ఇంధనం ద్వారా విడుదలయ్యే కాలుష్యం కాస్త అధికంగానే ఉంటుంది. వాతావరణ మార్పులకు కారణమవుతున్న గ్లోబల్ ఆంత్రోపోజెనిక్ ఉద్గారాలలో దాదాపు 5 శాతం వాటా విమానయాన రంగందేనని ఒక అంచనా.. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అనే దిశగా జరుగుతున్న పరిశోధనలు పురోగతిని సాధిస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్నాయి. ‘ జ్యూరిచ్‌కు చెందిన ప్రొఫెసర్ ఆల్డో స్టెయిన్‌ఫెల్డ్ రూపొందించిన ఒక పరిశోధనా పత్రం విమానాల్లో ఉపయోగించే ప్రస్తుత ఇంధనానికి ప్రత్యామ్నాయాలను సూచించింది. యూరోపియిన్ యూనియన్ ‘ సన్ టూ లిక్విడ్’ ప్రాజెక్టులో భాగంగా స్టెయిన్‌ఫెల్డ్ బృందం సౌరశక్తిని ఉపయోగించి ఇంధనాలను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ది చేసింది.
ఈ విధానంలో సూర్యరశ్మి, నీరు, కార్బన్ డయాక్సైడ్‌లను వాడుకొని ప్రత్యేక ఇంధనాన్ని రూపొందిస్తారు. ఇది ఉద్గారాలను చాలా వరకూ తగ్గిస్తుందని వీరు చెబుతున్నారు. ఈ బృందం 2017 నుంచి ప్రారంభించిన పరిశోధనల ఒక దశకు చేరింది. స్పెయిన్‌లోని IMDEA ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్‌లో సౌర ఇంధన ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ పరిశోధనలు పూర్తి స్థాయిలో ఫలిస్తే విమానయాన రంగంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం