అలర్ట్: వాట్సాప్ వాడేటప్పుడు ఈ ఫీచర్స్‌తో జాగ్రత్తగా ఉండండి
రోజూ పొద్దున్న లేవగానే.. వాట్సాప్ చూడటం అందరికీ సర్వసాధరణం అయిపోయింది. ప్రస్తుతమున్న టెక్నాలజీ కాలంలో స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. అయితే విచ్చవిడిగా వాట్సాప్‌ని ఉపయోగించడం ద్వారా తెలియకుండానే యూజర్లు సమస్యలు..
రోజూ పొద్దున్న లేవగానే.. వాట్సాప్ చూడటం అందరికీ సర్వసాధరణం అయిపోయింది. ప్రస్తుతమున్న టెక్నాలజీ కాలంలో స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. అయితే విచ్చవిడిగా వాట్సాప్‌ని ఉపయోగించడం ద్వారా తెలియకుండానే యూజర్లు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
వాట్సాప్ వాడేటప్పుడు ముఖ్య విషయాలు:
1. ఎప్పుడైనా మీకు తెలియన నెంబర్ నుంచి మీకు మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే ఆ నెంబర్‌ని బ్లాక్ చేయండి. లేదంటే.. మీ ప్రైవసీ చాటింగ్ అంతా అపరిచితుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే అపరిచితుల నుంచి మెసేజ్‌లు వస్తే ఆలోచించకుండా బ్లాక్ చేయండి.
2. ఇతరుల పేరులతో మీరు వాట్సాప్ చాటింగ్స్ చేయకండి. ఎందుకంటే భవిష్యత్తులో అది భారీగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేకపోలేదు. అందులోనూ ఇలా చేయడం సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది.
3. స్టార్ట్ ఫోన్ యూజర్లు వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సెక్యురిటీ నిమిత్తం వాట్సాప్ టూ స్టెప్ వెరిఫికేషన్ అప్లై చేసుకోవాలి. దీంతో సిమ్ స్వాపింగ్ మోసాలకు చెక్ పెట్టవచ్చు.
4. వాట్సాప్ స్టేటస్‌ను కేవలం మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతోనే మాత్రమే పంచుకోండి. ఎవరికి పడితే వారికి పెడితే.. మీ వ్యక్తిగత విషయాలకు భంగం వాటిల్లే ప్రమాదముంది.
5. వాట్సాప్ యూజర్లు ఎక్కువగా బ్యాకప్ ఆన్ చేస్తారు. కానీ దీనివల్ల మీ డేటా చోరీకి గురవొచ్చు. అందుకే ఆటో బ్యాకప్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలి.
6. వాట్సాప్ ద్వారా యూజర్లు పోర్న్ వీడియోలు, లింక్‌లు, ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు.
7. అలాగే.. మీ వాట్సప్ డీపీని సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి. అంటే.. డీపీ ద్వారా మీ పర్సనల్ వివరాలు పూర్తిగా తెలిసేలా పెట్టవద్దు.