జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-10.. గెట్ రెడీ టూ కౌంట్‌డౌన్‌..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-10 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇస్రో వాహక నౌక ద్వారా జీశాట్‌-1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. రక్షణ వ్యవస్థ, విపత్తుల సమాచారాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా జీశాట్‌-10పనిచేయనుంది.

జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-10.. గెట్ రెడీ టూ కౌంట్‌డౌన్‌..
Jyothi Gadda

|

Mar 03, 2020 | 1:40 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-10 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. విశ్వ వినువీధుల్లో సుదూర లక్ష్యాన్ని చేరుకోగలిగిన జీఎస్‌ఎల్‌వీ వాహక నౌక ద్వారా చంద్రయాన్‌కు సిద్ధమవుతున్న ఇస్రో…ఈ నెల 5న సాయంత్రం 5.43 గంటలకు జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-10ను ప్రయోగించనుంది. ఇస్రో వాహక నౌక ద్వారా జీశాట్‌-1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. రక్షణ వ్యవస్థ, విపత్తుల సమాచారాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా జీశాట్‌-10పనిచేయనుంది.

నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి మార్చి 5న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 వాహక నౌకను నింగిలోకి పంపేందుకు షార్ శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జీఎస్‌ఎల్‌వి వాహక నౌక అనుసంధానానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీని ద్వారా 2300 కిలోల బరువుగల జీ శాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. రేపు (బుధవారం)సాయంత్రం 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. అయితే, ఇస్రో చేపట్టనున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 ప్రయోగం వల్ల మరోప్రయోగం వాయిదా పడే పరిస్థితి నెలకొంది.

షార్ నుంచి వచ్చే నెల 18న ప్రయోగించ తలపెట్టిన పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు శాస్తవ్రేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ సి-49ద్వారా రీశాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపాల్సి ఉంది. ప్రస్తుతం జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం కారణంగా పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేయాలని శాస్తవ్రేత్తలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu