Alcohol: మద్యం ఎంత తాగారో స్మార్ట్‌ ఫోన్‌ చెప్పేస్తుంది.. మాటలతోనే పసి గట్టే టెక్నాలజీ..

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసినా చాలా మంది అంత సులభంగా వదలరు. తాము తాగి ఇతరులకు కూడా ఇబ్బందులు తెస్తుంటారు కొందరు మందు బాబులు. ముఖ్యంగా రాత్రుళ్లు ఫుల్లుగా తాగి రోడ్ల మీదికి..

Alcohol: మద్యం ఎంత తాగారో స్మార్ట్‌ ఫోన్‌ చెప్పేస్తుంది.. మాటలతోనే పసి గట్టే టెక్నాలజీ..
Alcohol
Follow us

|

Updated on: Jan 08, 2023 | 1:19 PM

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసినా చాలా మంది అంత సులభంగా వదలరు. తాము తాగి ఇతరులకు కూడా ఇబ్బందులు తెస్తుంటారు కొందరు మందు బాబులు. ముఖ్యంగా రాత్రుళ్లు ఫుల్లుగా తాగి రోడ్ల మీదికి ఎక్కుతుంటారు. ఇష్టా రాజ్యంగా డ్రైవింగ్ చేస్తూ తమతో పాటు తోటి వారి ప్రాణాలను సైతం డేంజర్‌లో పడేస్తుంటారు. ఇందుకోసమే ట్రాఫిక్ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లను నిర్వహిస్తూ మందు బాబుల ఆట కట్టిస్తుంటారు. దీని కోసం బ్రీత్ ఎనలైజర్‌ మిషన్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇదే పనిని స్మార్ట్ ఫోన్‌లు చేస్తే ఎలా ఉంటుంది.? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. శాస్త్రవేత్తలు ఈ దిశగా అడుగులు సైతం వేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి ఎంత మద్యం తీసుకున్నాడన్న విషయాన్ని అతను మాట్లాడుతున్న తీరు ఆధారంగా కనిపెట్టే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆల్గరిథమ్‌ను పరిశోధకులు రూపొందించారు. లా ట్రోబ్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ ఆల్గరిథమ్‌ను రూపొందించారు. మద్యం సేవించిన వ్యక్తి 12 సెకన్ల ఆడియో క్లిప్‌ను వినడం ద్వారా వారు ఎంత ఆల్కహాల్ తీసుకున్నారో చెప్పేస్తుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న బ్రీత్‌ అనలైజర్ ద్వారా ఎంత ఆల్కహాల్‌ తీసుకున్నారో తెలుసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు కేవలం మత్తులో మాట్లాడిన మాటల ఆధారంగా ఎంత మద్యం తీసుకున్నారో తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న ఆల్గరిథమ్‌ను మరింత డెవలప్‌ చేసిన తర్వాత మొబైల్ అప్లికేషన్‌ రూపంలో తీసుకున్నారు. దీని ద్వారా స్మార్ట్‌ ఫోన్‌లో యాప్‌ ఓపెన్‌ చేసిన ఎదుటి వ్యక్తి మాటలను రికార్డ్‌ చేస్తే చాలు వారు మద్యం ఎంత తీసుకున్నారో ఇట్టే చెప్పేస్తుంది. 12,360 ఆడియో క్లిప్‌ల డేటా బేస్‌ను ఉపయోగించి చేసిన పరిశోధనలు విజయవంతం అయినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..