Samsung New Galaxy: సామ్‌సంగ్ న్యూ బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

Samsung Galaxy: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌కు చెందిన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎం 32 ను భారత్‌లో విడుదల...

Samsung New Galaxy: సామ్‌సంగ్ న్యూ బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
Smart Phone

Samsung Galaxy: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌కు చెందిన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎం 32 ను భారత్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 15 నుంచి 20 వేల రూపాయల ధరతో కంపెనీ ప్రదర్శించనుంది. 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో పాటు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో కూడిన గెలాక్సీ ఎం 32 జూన్ చివరి వారంలో మార్కెట్‌లోకి రానుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

గెలాక్సీ M32 రిఫ్రెష్ రేటు 90 Hz గా ఉంది. ఇది గేమ్స్ ఆడే వారికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ మొబైల్‌లో హై బ్రైట్‌నెస్ మోడ్ ఇచ్చారు. గరిష్టంగా 800 నిట్ల వరకు ఉంటుంది. గెలాక్సీ M32 మొబైల్‌లో 48 MP క్వాడ్ కెమెరాలను కలిగి ఉంది. అలాగే 6,000 mAh బ్యాటరీ కలిగి ఉంది.

అమెజాన్, శామ్‌సంగ్.కామ్, ఇతర రిటైల్ అవుట్‌లెట్లలో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. భారతదేశంలో శామ్‌సంగ్ మొట్టమొదటి మిడ్-సెగ్మెంట్ 5జి మొబైల్ అయిన గెలాక్సీ ఎం 42 లాంచ్ అయిన ఒక నెల తరువాత ఈ ప్రయోగం జరగనుంది. గెలాక్సీ ఎం 32 ఈ ఏడాది శామ్‌సంగ్ ఐదవ గెలాక్సీ ఎం సిరీస్ స్మార్ట్‌ఫోన్ అవుతుంది.

Also read:

సౌత్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఛాన్స్ వస్తే తెలుగులో చేస్తానంటున్న సోనమ్..

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అమలులోకి వచ్చిన మద్యం డోర్ డెలివరీ స్కీమ్…