Varun Tej : మాస్ మహారాజా రవితేజ ప్లేస్ ను రీప్లేస్ చేసిన మెగా హీరో.. ఆ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్..

వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటూ పోతున్న రవితేజ కోసం చూసి చూసి అలిసిపోయిన ఓ డైరెక్టర్‌ ఇక లాభం లేదనుకుని మూవ్ ఆన్ అయ్యారట.

Varun Tej : మాస్ మహారాజా రవితేజ ప్లేస్ ను రీప్లేస్ చేసిన మెగా హీరో.. ఆ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్..
Varun Tej Instagram
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2021 | 10:33 PM

వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటూ పోతున్న రవితేజ కోసం చూసి చూసి అలిసిపోయిన ఓ డైరెక్టర్‌ ఇక లాభం లేదనుకుని మూవ్ ఆన్ అయ్యారట. ఇక నేను వెయిట్ చేయలేనండి అంటూ రవితేజకు బాయ్‌ చెప్పి..నేరుగా మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ను కలిసి హాయ్‌ చెప్పారట. ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. “మేము వయసుకు వచ్చాం” సినిమాతో డైరెక్టర్‌ గా టాలీవుడ్లో అడుగుపెట్టిన నక్కిన త్రినాథ్‌ రావ్‌.. నాని నటించిన “నేను లోకల్‌” సినిమాతో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఇక ఇటీవల రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే రవితేజకు నక్కిన స్క్రిప్ట్‌ నచ్చినప్పటికీ.. డేట్స్‌ ఖాళీ లేకపోవడంతో వెయిట్ చేయాలని చెప్పారట. కాని కరోనా, లాక్‌డౌన్‌ వల్ల రవితేజ సినిమాలు మరింత ఆలస్యం కానుండడంతో.. ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారట డైరెక్టర్‌ త్రినాథ్‌ రావు.

అయితే ఇప్పుడీ ప్రాజెక్టను మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌తో వర్కవుట్ చేయాలని చూస్తున్నారట. అందుకోసం తాజాగా వరుణ్‌ బాబును కలిసి స్టోరీ నరేట్ చేశారట. అంతేకాదు బౌండెడ్‌ స్క్రిప్ట్ చేతిలో పెట్టి చదవల్సిందిగా  వరుణ్ ను డైరెక్టర్‌ కోరారట. అందుకు వరుణ్ పాజిటివ్గా కూడా స్పందించారని ఇండస్ట్రీలో టాక్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

vanitha vijayakumar: నీ పని నువ్వు చూసుకో.. నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వనిత విజయ్ కుమార్

Varalaxmi Sarathkumar : బాలకృష్ణ సినిమాలో జయమ్మ.. వరలక్ష్మీ శరత్ కుమార్ ను రంగంలోకి దింపుతున్న గోపీచంద్ మలినేని..

sarkaru vaari paata : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. త్వరలోనే సర్కారు వారి పాట అప్డేట్స్..