vanitha vijayakumar: నీ పని నువ్వు చూసుకో.. నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వనిత విజయ్ కుమార్

ఆ మధ్య మీడియాలో తెగ హల్ చల్ చేసిన నటి వనిత విజయ్ కుమార్. ఈ అమ్మడు సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది.

vanitha vijayakumar: నీ పని నువ్వు చూసుకో.. నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వనిత విజయ్ కుమార్
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2021 | 10:20 PM

vanitha vijayakumar: ఆ మధ్య మీడియాలో తెగ హల్ చల్ చేసిన నటి వనిత విజయ్ కుమార్. ఈ అమ్మడు సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. మూడో పెళ్లి కేంద్రంగా వనిత విజయ్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. పీటర్ పాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వనిత విజయ్ కుమార్ చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మూడో భర్తకు దూరమైన విషయం తెలిసిందే. ఇక 2000సంవత్సరంలో నటుడు ఆకాష్ ను వనిత వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలకు జన్మనించిన తర్వాత అతడికి విడాకులు ఇచ్చారు. ఆతర్వాత 2007లో ఓ బిజినెస్ మ్యాన్ ను వివాహమాడింది. ఆయనతో ఐదేళ్ళు కాపురం చేసిన తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్ తో నాలుగేళ్ళు ప్రేమాయణం సాగించింది. ఆ తరవాత 2017లో అతడితో విడిపోయింది.

ఇక పీటర్ పాల్ తన మొదటి భార్య ఎలిజబెత్‌ను మోసం చేసి వనితను పెళ్లి చేసుకున్నారు. తనకుచెప్పకుండా, తనతో ఇంకా విడాకులు కాకుండానే పీటర్ రెండో పెళ్లి చేసుకున్నారంటూ ఎలిజబెత్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే బర్త్ డే వేడుకలకు గోవాకు వెళ్లడం, అక్కడ పీటర్ పాల్ తీరు నచ్చకపోవడంతో ఇంట్లోంచి గెంటేశారట వనిత. ఈ మేరకు మూడో పెళ్లి కూడా పెటాకులైందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా వనిత విజయ్ కుమార్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాను సింగిల్ గా ఉన్నాను అలాగే హ్యాపీ గా ఉన్నాను అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది వనిత. దీనిపై ఓనెటిజన్ ఫైర్ అయ్యాడు. ఎదిగినా పిల్లలున్నారు అయినా బాధ్యత లేకుండా సింగిల్ అని పోస్ట్ పెట్టటమేంటి అంటూ కామెంట్ పెట్టారు. మరి కొంతమంది మరో పెళ్ళికి రెడీ అవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.  నెటిజన్స్ కామెంట్స్ కు ఘాటుగా స్పందించారు వనిత. ఎలా ఉండాలో మాకు తెలుసు.. ,నీపని నువ్వు చూసుకో అంటూ రిప్లే ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Syed Sohel Ryan: మంచి మనసు చాటుకున్న సోహెల్.. అన్న మాటప్రకారం సామాజిక బాధ్యతతో సహాయం..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..