Samsung Galaxy Z Fold 4: మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లను రేపు విడుదల చేయనున్న శాంసంగ్!

మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇప్పటికే తనదైన స్టైల్ లో ఫోల్డబుల్ ఫోన్లను రిలీజ్ చేసిన ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్ (Samsung) రేపు మరో రెండు రకాల మడతపెట్టే ఫోన్లను విడుదలచేయనుంది. శాంసగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 4 (Galaxy Z Flip 4), శాంసంగ్ గెలాకీ Z ఫోల్డ్ 4 (Galaxy Z Fold 4) పేరుతో నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్ తో మొబైల్ వినియోగదారులను

Samsung Galaxy Z Fold 4: మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లను రేపు విడుదల చేయనున్న శాంసంగ్!
Samsung New Mobile
Follow us

|

Updated on: Aug 09, 2022 | 4:51 PM

Samsung Galaxy Z Flip 4: మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇప్పటికే తనదైన స్టైల్ లో ఫోల్డబుల్ ఫోన్లను రిలీజ్ చేసిన ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్ (Samsung) రేపు మరో రెండు రకాల మడతపెట్టే ఫోన్లను విడుదలచేయనుంది. శాంసగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 4 (Galaxy Z Flip 4), శాంసంగ్ గెలాకీ Z ఫోల్డ్ 4 (Galaxy Z Fold 4) పేరుతో నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్ తో మొబైల్ వినియోగదారులను ఆకర్షించేందుకు రెడీ అయింది. జస్ట్ మరికొన్ని గంటల్లో ఈరెండు ఫోన్లతో పాటు.. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5ను రిలీజ్ చేయనుంది. రేపు జరిగే శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాకెడ్-2022 ఈవెంట్ లో ఈకొత్త ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. Samsung Galaxy Z Fold 4 ఫీచర్లు: ఈ మోడల్ మొబైల్ ఫోన్ 6.2 అంగుళాల డిసెప్లేతో పాటు.. 7.6 అంగుళాల పరిమాణంలో ఇంటరీయన్ డిస్‌ ప్లే కలిగి ఉంటుంది. Samsung Galaxy Z Fold 4 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఔటర్ డిస్ ప్లేలో స్లిమ్డ్ డౌన్ కీలు, బెజెల్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12L లో చూసినట్లు Samsung Galaxy Z Fold 4 ఫోన్ దిగువన మౌంటెడ్ టాస్క్ బార్ ను కలిగి ఉంది ఈఫోన్. Galaxy Z Fold 4 మూడు రంగులలో రానుంది. వచ్చే 4 సంవత్సరాల్లో పది లక్షల మొబైల్స్ విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ధర రూ.1,45000 వేలుగా అంచనా వేస్తున్నారు. ఇదే మోడల్ లో 256 GB వేరియంట్ ఫోన్ రూ.1,55,002 ఉండనుంది. 12 GB RAM, స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ Gen 1తో జత చేయబడిన 4400 mAh బ్యాటరీతో ఈమొబైల్ మార్కెట్లోకి రాబోతుంది. ఇది ల్యాండ్‌స్కేప్ ఫోటోలను క్లిక్ చేయడానికి 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 10 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా ఈఫోన్ లో ఉండనుంది.

Samsung Galaxy Z Flip 4: ఈమొబైల్ ఫోన్ కూడా గ్రే, పర్పుల్, గోల్డ్, లేత నీలం రంగుల్లో రిలీజ్ కానుంది. ఫోన్ విడుదలైన తర్వాత అదే రిలీజ్ ఈవెంట్ లో ధరను ప్రకటిస్తారు. శాంసంగ్ కంపెనీ Galaxy Z Flip 3 ని రూ.84,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. Galaxy Z Flip 4 128 జిబి ధర రూ.93000 ఉండొచ్చని అంచనావేస్తున్నారు. 8GB RAM తో 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్‌ల ధర వరుసగా రూ.97,200 నుంచి దాదాపు రూ.1,07,700 రూపాయలు ఉండొచ్చు. ఈఫోన్ ను అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే Samsung Galaxy Z Flip 4 కోసం ముందస్తు రిజర్వేషన్లను ప్రారంభించింది. Samsung ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా ప్రత్యేకమైన స్టోర్‌ల ద్వారా ఈఫోన్ ను ప్రీ-రిజర్వ్ చేయడానికి వినియోగదారులు రూ. 2,000 చెల్లించాలి. కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రీ-రిజర్వ్ చేసిన వారికి కంపెనీ రూ.5,000 విలువైన బహుమతిని అందించనుంది. కూడా అందిస్తుంది.  భారత్ లో ఈఫోన్లు ఆగష్టు 26వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

రేపు జరిగే శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాకెడ్-2022 ఈవెంట్ ను తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రసారం చేయనుంది. భారత ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు ఈఈవెంట్ ను చూడొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి