AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phone: కొత్త ఫోన్‌తో దుమ్మురేపుతున్న సామ్‌సంగ్.. ఫీచర్స్ తెలిస్తే షాకవుతారంతే..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ భారత మార్కెట్ సూపర్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఎగువ మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌గా రిలీజ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ యువతను ఆకట్టుకుంటుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్-56 పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ స్లిమ్ డిజైన్‌తో ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ నూతన ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Smart Phone: కొత్త ఫోన్‌తో దుమ్మురేపుతున్న సామ్‌సంగ్.. ఫీచర్స్ తెలిస్తే షాకవుతారంతే..!
Samsung Galaxy F56
Nikhil
|

Updated on: May 10, 2025 | 8:39 AM

Share

సామ్‌సంగ్ కంపెనీ ఇటీవల దాని ఎఫ్ సిరీస్ లైనప్‌లో స్లిమ్ డిజైన్‌తో వచ్చే గెలాక్సీ ఎఫ్-56 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 7.2 ఎంఎం మందంతో ఉంటుంది. ఎల్‌పీడీడీఆర్ 5 ఎక్స్ ర్యామ్‌తో ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ ద్వారా ఆధారంగా ఎఫ్-56 5జీ సున్నితమైన మల్టీ టాస్కింగ్, లాగ్-ఫ్రీ గేమింగ్, శక్తి సామర్థ్యాన్ని హామీ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ముందు, వెనుక రెండు గ్లాసులు గొరిల్లా విక్టస్ ప్లస్ రక్షణతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సొగసైన ఫారమ్ ఫ్యాక్టర్‌తో పాటు అధిక మన్నికను అందిస్తుంది. 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్-56 5జీ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. గెలాక్సీ ఎఫ్56లో ఓఐఎస్, 12 ఎంపీ హెచ్‌డీఆర్ ఫ్రంట్ కెమెరాతో 50 ఎంపీ ప్రధాన కెమెరా ఉంది. అందువల్ల పోర్ట్రెయిట్ 2.0, బిగ్ పిక్సెల్ టెక్, ఏఐ ఐఎస్‌పీ వంటి ఫోటోగ్రఫీ ఫీచర్‌లతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 4 కే 30 ఎఫ్‌పీఎస్ హెచ్‌డీఆర్ సాయంతో రికార్డు చేసుకోవచ్చు. సామ్‌సంగ్ ఆబ్జెక్ట్ ఎరేజర్, ఎడిట్ సజెషన్స్ వంటి ఏఐ-ఆధారిత ఎడిటింగ్ సాధనాలు యూజర్లు అమితంగా ఆకట్టుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. సిక్స్త్ జనరేషన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో పాటు ఎఫ్-56 కోసం ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని సామ్‌సంగ్ కంపెనీ ప్రకటించింది. 

సామ్‌సంగ్ ఎఫ్-56 స్మార్ట్ ఫోన్ వన్ యూఐ7తో వస్తుంది. అందువల్ల గూగుల్ జెమినీ సపోర్టతో పాటు నౌ బార్ సాయంతో త్వరిత అప్‌డేట్స్ పొందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా సామ్ సంగ్ వ్యాలెట్ పేలో అందుబాటులో ఉన్నా ట్యాప్ అండ్ పేకు కూడా సపోర్ట్ చేస్తుంది. సామ్‌సంగ్ ఎఫ్-56 ద్వారా 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ  స్మార్ట్ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌తో వచ్చే ఫోన్ ధర రూ.25,999గా ఉంటే 8 జీబీ + 256 జీబీ రూ.28,999గా ఉంది. అలాగే ఈ రెండు ఫోన్లను కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్-56 5 జీ స్మార్ట్ ఫోన్ రెండు రంగుల్లో అంటే గ్రీన్‌తో పాటు వైలెట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి