Samsung Galaxy F14 5G: తక్కువ బడ్జెట్లో బెస్ట్ మల్టీ టాస్కింగ్ ఫోన్ ఇది.. పైగా 30శాతం డిస్కౌంట్.. మిస్ చేసుకోవద్దు..

మీరు అద్భుతమైన కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీకు శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ మంచి ఆప్షన్. అతి తక్కువ ధరలో మీరు దీనిని కొనుగోలు చేయొచ్చు. ఇది 6జీబీ ర్యామ్ తో పాటు, 128జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఇది శామ్సంగ్ 1330 సీపీయూ ద్వారా శక్తిని పొందుతుంది. దీనిలో ముందువైపు 13ఎంపీ కెమెరాతో పాటు వెనుకవైపు ఎల్ఈడీ ఫ్లాష్ తో పాటు 50ఎంపీ, 2ఎంపీ డ్యూయల్ కెమెరా సెట్ ఉంటుంది.

Samsung Galaxy F14 5G: తక్కువ బడ్జెట్లో బెస్ట్ మల్టీ టాస్కింగ్ ఫోన్ ఇది.. పైగా 30శాతం డిస్కౌంట్.. మిస్ చేసుకోవద్దు..
Samsung Galaxy F14 5g
Follow us
Madhu

|

Updated on: Mar 27, 2024 | 8:54 AM

రంగుల సంబరం హోలీ సందర్భంగా పలు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్లాట్ ఫారాలు అనేక ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించాయి. అధికంగా డిస్కౌంట్లు, తగ్గింపు ధరలపై పలు బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, గ్యాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ కూడా ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై టాప్ లేపే ఆఫర్లను ప్రకటించింది. డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాక, పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లలో భాగంగా శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. ఇది 5జీ ఫోన్. పైగా అధిక కెమెరా క్వాలిటీ ఉంటుంది. మీరు కనుక రూ. 15,000లోపు ధరలో బెస్ట్ కెమెరా క్వాలిటీ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇదే బెస్ట్ ఆప్షన్. ఈ నేపథ్యంలో శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఫొటోల కోసం అయితే బెస్ట్..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలోని అద్భుతమైన, తాజా ఫొటోలను ఇతరులతో పంచుకోవాలని కోరుకుంటారు. అదనంగా, చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో తమ ప్రతిభను ప్రదర్శించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి మంచి క్వాలిటీ కెమెరా అవసరం అవుతోంది. చాలా మంది ప్రత్యేకంగా కెమెరాలు కొనుగోలు చేయడం కంటే.. ఫోన్లలోనే మంచి కెమెరా అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. మీరు అద్భుతమైన కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీకు శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ మంచి ఆప్షన్. అతి తక్కువ ధరలో మీరు దీనిని కొనుగోలు చేయొచ్చు. ఇది 6జీబీ ర్యామ్ తో పాటు, 128జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. ఇది శామ్సంగ్ 1330 సీపీయూ ద్వారా శక్తిని పొందుతుంది. దీనిలో ముందువైపు 13ఎంపీ కెమెరాతో పాటు వెనుకవైపు ఎల్ఈడీ ఫ్లాష్ తో పాటు 50ఎంపీ, 2ఎంపీ డ్యూయల్ కెమెరా సెట్ ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సైట్లో ఈ ఫోన్ పై ఆఫర్ అందుబాటులో ఉంది. దీనిని కేవలం రూ. 12,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్పెసిఫికేషన్‌లు..

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ పూర్తి స్పెసిఫికేషన్లను పరిశీలస్తే.. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పని చేస్తుంది. 6.6 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, 2408 x 1080 పిక్సెల్‌ రిజల్యూషన్ తో ఉంటుంది. ర్యామ్ సైజ్ 6జీబీ ఉంటుంది. స్టోరేజ్ సామర్థ్యం 128జీబీ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 6000ఎంఏహెచ్ ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే శామ్సంగ్ 1330 ఆధారంగా శక్తి పొందుతుంది. ప్రైమరీ కెమెరా 50ఎంపీ కాగా.. మరో 2ఎంపీ డెప్త సెన్సార్ ఉంటుంది. ముందు వైపు సెల్ఫీల కోసం 13ఎంపీ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో మీరు సులభంగా మల్టీ టాస్కింగ్ చేయవచ్చు, గేమ్‌లు ఆడవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్పీ ధర రూ. 18490కాగా.. దీనిపై అమెజాన్ 30% తగ్గింపు అం దిస్తుండటంతో మీరు దీన్ని కేవలం రూ. 12990కి కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..