Youtube: 22.5 లక్షల వీడియోలను డిలీట్ చేసిన యూట్యూబ్.. ఎందుకో తెలుసా.?
గత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 90 లక్షల వీడియోలను తొలగించారు. వీటిలో ఏకంగా 22.5 లక్షల వీడియోలు భారత్‌కు చెందినవి కావడం గమనార్హం. తమ కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగానే ఆ వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ తెలిపింది. ఈ వీడియోల్లో ఏకంగా 96 శాతం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినట్లు యూట్యూబ్...
ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజూ లక్షల సంఖ్యలో వీడియోలు యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ అవుతుంటాయి. అయితే ఈ వీడియోలన్నీ కచ్చితంగా యూట్యూబ్ నిబంధనలకు లోబడి ఉండాలని తెలిసిందే. ఒకవేళ అలా నిబంధనలకు విరుద్దంగా వీడియోలను అప్‌లోడ్ చేస్తే యూట్యూబ్ యాజమాన్యం వీడియోనుల డిలీట్ చేస్తుంది. తాజాగా ఇలాంటి వీడియోలను భారీ ఎత్తున డిలీట్ చేసింది యూట్యూబ్.
గత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 90 లక్షల వీడియోలను తొలగించారు. వీటిలో ఏకంగా 22.5 లక్షల వీడియోలు భారత్‌కు చెందినవి కావడం గమనార్హం. తమ కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగానే ఆ వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ తెలిపింది. ఈ వీడియోల్లో ఏకంగా 96 శాతం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినట్లు యూట్యూబ్ గుర్తించింది. ఇదిలా ఉంటే ఈ వీడియోల్లో ఏకంగా 53.46 శాతం వీడియోలు ఒక్క వ్యూ కూడా రాక ముందే తొలగించినట్లు యూట్యూబ్ తెలిపింది.
యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అంశాల పరంగా చూస్తే.. స్పామ్ వీడియోలు, సెన్సిటివ్ కంటెంట్, హింసాత్మక దృశ్యాలు, తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ వీడియోలు వంటివి ఉన్నాయి. ఇలాంటి కంటెంట్‌తో కూడిన వీడియోలను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించినట్లు యూట్యూబ్ తన నివేదికలో పేర్కొంది. కాగా యూట్యూబ్ కొన్ని ఛానెల్స్‌ను కూడా డిలీట్ చేసినట్లు తెలిపింది. గడిచిన అక్టోబర్-డిసెంబర్‌లో ఏకంగా 2 కోట్ల ఛానెల్స్‌ను డిలీట్ చేసినట్లు తెలిపింది.
తప్పుదారి పట్టించే వీడియోలు, అశ్లీల కంటెంట్ ఉన్న యూట్యూబ్ ఛానెల్స్‌ను తొలగించినట్లు యూట్యూబ్ తెలిపింది. ఇదిలా ఉంటే యూట్యూబ్ కమ్యూనిటీలో పేర్కొన్న మార్గదర్శకాలను 90 రోజుల్లో మూడుసార్లు ఉల్లంఘిస్తే ఛానెల్‌ను రద్దు చేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..