Holi Sale: హోలీ వేళ.. డిస్కౌంట్ మేళా.. వాటిపై ఏకంగా 60 శాతం డిస్కౌంట్..

పండగ సందర్భంగా లోటస్ ఎలక్ట్రానిక్స్ సంస్థ గ్రాండ్ హోల్ సేల్ ను ప్రారంభించింది. తన ఖాతాదారుల కోసం దాదాపు 60 శాతం డిస్కౌంట్ ను అందజేస్తుంది. వివిధ ఎలక్ట్రానిక్స్ వస్తువులు, గృహోపకరణాలు, ఏసీలను అత్యంత ధరకు అందుబాటులో ఉంచింది. ఈ హోలీ సేల్ ఈనెల 31వ తేదీ వరకూ కొనసాగుతుంది.

Holi Sale: హోలీ వేళ.. డిస్కౌంట్ మేళా.. వాటిపై ఏకంగా 60 శాతం డిస్కౌంట్..
Lotus Holi Sale
Follow us
Madhu

|

Updated on: Mar 27, 2024 | 7:24 AM

హోలీ సందర్భంగా వివిధ రకాల సంస్థలు తమ వస్తువులపై భారీ డిస్కౌంట్ ప్రకటించాయి. అత్యంత తక్కువ ధరలకు ఎలక్ట్రానిక్స్ వస్తువులను అందజేస్తున్నాయి. ఈ తగ్గింపు ధరలు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. పండగ సందర్భంగా చాలా మంది కొత్త వస్తువులను కోనుగోలు చేస్తారు. వారందరి కోసం భారీ తగ్గింపు ధరలతో వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకు నచ్చిన, అవసరమైన వస్తువులను అత్యంత చౌక ధరలలో సొంత చేసుకోండి.

లోటస్ హోలీ సేల్..

పండగ సందర్భంగా లోటస్ ఎలక్ట్రానిక్స్ సంస్థ గ్రాండ్ హోల్ సేల్ ను ప్రారంభించింది. తన ఖాతాదారుల కోసం దాదాపు 60 శాతం డిస్కౌంట్ ను అందజేస్తుంది. వివిధ ఎలక్ట్రానిక్స్ వస్తువులు, గృహోపకరణాలు, ఏసీలను అత్యంత ధరకు అందుబాటులో ఉంచింది. ఈ హోలీ సేల్ ఈనెల 31వ తేదీ వరకూ కొనసాగుతుంది. కొనుగోలుదారులు lotuselectronics.com నుంచి ఆన్ లైన్ లో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఆఫ్ లైన్ లో కంపెనీ స్టోర్ల కు వెళ్లి నచ్చిన వస్తువులను తీసుకోవచ్చు. ఈ రెండు విధానాల్లో కూడా ఆఫర్లు వర్తిస్తాయి.

తగ్గింపు ధరలు..

హోలీ సేల్ సందర్భంగా లోటస్ కంపెనీ మంచి తగ్గింపు ధరలను ప్రకటించింది. జేబీఎల్ యాంప్లిఫైడ్ 100 డబ్ల్యూ స్పీకర్ ను రూ. 20,999కే అందిస్తోంది. సోనీ పార్టీ బాక్స్ స్పీకర్ రూ. 32,900కు అందుబాటులో ఉంది. ఒప్పోరెనో 10 ప్రోప్లస్ ఫోన్ ను డిస్కౌంట్ పై రూ. 54,999లకే ఖాతాదారులకు అందజేస్తుంది. ముఖ్యంగా హెయిర్ స్టైల్ పరికరాలు రూ.1,299 నుంచి అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అందుబాటు ధరలో ఏసీలు..

వేసవి కాలం వచ్చేసింది. ఎండలు క్రమంగా పెరిగిపోతున్నాయి. చల్లదనం ఇచ్చే పరికరాల వాడకం పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఏసీలను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. వారందరి కోసం లోటస్ సంస్థ హోలీ సేల్ లో ఏసీలను అందుబాటులో ఉంచింది. వీటి ధర రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ప్రతి ఇంట్లో అత్యంత అవసరమైన రిఫ్రిజిరేటర్లు కూడా తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. కేవలం రూ.9 వేల నుంచి వీటి ధరలు మొదలవుతున్నాయి.

ఆనందం రెట్టింపు..

పండగ సమయంలో ప్రకటించిన ఈ ప్రత్యేక తగ్గింపు ధరలు కొనుగోలుదారుల ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. వారికి అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. పండగ గుర్తుగా ఇంట్లోకి కొత్త వస్తువులను తీసుకురావడం శుభపరిణామంగా భావిస్తారు. ఇంటికి వచ్చిన అతిథులు, బంధువులకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా డబ్బులను బాగా ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. మీ ఆర్థిక అవసరాలకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..