AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioPhone Next: జియో ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్‌.. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే..

Jio Phone Next Exchange Offer: గత ఏడాదిఅక్టోబర్‌లో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం రూ.6,499 అందుబాటులో లభించనుంది. అయితే సామాన్య వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

JioPhone Next: జియో ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్‌.. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే..
Jiophone Next
Basha Shek
|

Updated on: May 19, 2022 | 6:35 AM

Share

Jio Phone Next Exchange Offer: ప్రముఖ టెలికాం దిగ్గజం జియో సంస్థ మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. తన జియో ఫోన్‌ నెక్స్ట్‌(JioPhone Next) పై సరికొత్త డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. గత ఏడాదిఅక్టోబర్‌లో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం రూ.6,499 అందుబాటులో లభించనుంది. అయితే సామాన్య వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం ఏదైనా 4G ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేసి జియో ఫోన్‌ నెక్స్ట్‌ను కొనుగోలు చేస్తే మొత్తం ధరలో రూ.2 వేలు తగ్గింపు లభించనుంది. ఈ మేరకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో జియో ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా 4జీ సౌలభ్యం, ప్రీమియం ఫీచర్‌లతో జియో గతేడాది అక్టోబర్‌లో మార్కెట్లోకి ఈ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది రిలయన్స్‌ జియో. 5.45 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ స్క్రీన్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ ఫోన్‌.. 2జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజీకి మద్దతిస్తుంది. ఇక మెమొరీని 512 జీబీ వరకు విస్తరించుకునే సదుపాయం ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 215 క్యూఎమ్‌ ప్రాసెసర్‌, వెనుకాల 13 MP, ముందు 8 MP ఆటో ఫోకస్‌ కెమెరాలు, 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులోని స్పెషల్‌ ఫీచర్లు.

వాయిస్‌ అసిస్టెంట్‌, ఆటోమెటిక్‌ రీడ్‌ అలౌడెడ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ టెక్ట్స్‌, 12 భాషల్లోకి అనువదించే లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి అదనపు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. డ్యూయల్‌ సిమ్‌తో వచ్చే ఈ మొబైల్‌ సరికొత్త ప్రగతి ఓఎస్‌పై రన్‌ అవుతుంది. కాగా ప్రస్తుతం జియో ఫోన్‌ నెక్స్ట్‌ ధర రూ.6,499గా ఉంది. రూ.1,999 ముందస్తు చెల్లింపుతో రూ.500 ప్రాసెసింగ్ ఫీజుతో కలిపి దీన్ని కొనుగోలు చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని 18 లేదా 24 నెలల వాయిదాలలో చెల్లించుకోవచ్చు. డిస్కౌంట్‌ ఆఫర్‌కు కూడా ఈ చెల్లింపు వర్తించనుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read: 

Gold, Silver Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు..!

Hyderabad: భాగ్యనగరంలో అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్​లు, లారీల సేవలు బంద్.. ఖైరతాబాద్ RTA ఆఫీస్ వద్ద భారీ ధర్నాకి పిలుపు

Lucknow Super Giants: 333 స్ట్రైక్ రేట్‌తో 13 సిక్సులు, 14 ఫోర్లు.. బౌలర్ల ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలోనే అలా చేసిన జోడీ..