Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 14: భారత్‌లో iPhone 14 విడుదలయ్యేది అప్పుడే.. స్పెసిఫికేషన్‌, ధరలు ఎలా ఉన్నాయంటే?

యాపిల్ తన కొత్త ఐఫోన్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌‌లను ప్రతిఏటా ఒకే నెలలలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఐఫోన్ 14 సిరీస్‌ ఫోన్లను అదే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

iPhone 14: భారత్‌లో iPhone 14 విడుదలయ్యేది అప్పుడే.. స్పెసిఫికేషన్‌, ధరలు ఎలా ఉన్నాయంటే?
Apple Iphone 14
Follow us
Venkata Chari

|

Updated on: May 18, 2022 | 9:01 PM

ఐఫోన్ 14 సిరీస్ ఈ ఏడాది చివర్లో విడుదల అవుతుందని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఐఫోన్ సిరీస్‌లోని నాలుగు కొత్త మోడల్స్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి “మినీ” మోడల్ ఉండదని వార్తలు వెలువడుతున్నాయి. దీనిక బదులుగా ఆపిల్ ఈసారి ఐఫోన్ 14 మాక్స్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసినట్లు లీకులు చెబుతున్నాయి. కాగా, ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు విడుదల చేయడంలో జాప్యం ఉంటుంద‌నే అంచ‌నాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో.. తాజాగా ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. కొత్త ఫోన్లను సెప్టెంబ‌ర్ 13న యాపిల్ విడుదల చేస్తుంద‌ని ఐడ్రాప్ న్యూస్‌లో లీక్స్‌ యాపిల్‌ ప్రో పేర్కొంది. కాగా, ప్రస్తుతం ఈ న్యూస్‌పై యాపిల్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.

అయితే, ఈవెంట్‌ను ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారా అనే విషయం కూడా ప్రస్తుతానికి వెల్లడించలేదు. కాగా, యాపిల్ జూన్ 6న నిర్వహించే డెవల‌ప‌ర్ల కాన్ఫరెన్స్‌ డ‌బ్ల్యూడ‌బ్ల్యూడీసీ 2022 ఏర్పాటు చేయడంలో బిజీగా మారింది. అధికారిక లాంచ్‌కు ముందు, ఐఫోన్ 14 మాక్స్‌తో సహా రాబోయే ఐఫోన్ మోడల్‌ల గురించి పలు లీక్‌లు నెట్టింట్లో సందడిచేస్తున్నాయి.

ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్స్..

ఇవి కూడా చదవండి

ఐఫోన్ 14 మ్యాక్స్ 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఐఫోన్ 12 వంటి వైడ్-నాచ్‌ని కలిగి ఉంది. ప్రో మోడల్ వేరే డిజైన్, పిల్-సైజ్ నాచ్‌ని పొందవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ లోని నాలుగు మోడల్‌లు A16 బయోనిక్ చిప్‌సెట్ తో రానున్నాయి. ఇది iPhone 13 సిరీస్‌లో ఉన్న A15 బయోనిక్ చిప్ కంటే కొంచెం ఎక్కువగా ఆప్టిమైజ్ చేస్తుందని భావిస్తున్నారు.

ఐఫోన్ 13 వలె, ఐఫోన్ 14 మోడల్ 128 GB ఇంటర్నల్ మెమరీని అందించగలదని తెలుస్తోంది. కెమెరాల గురించి మాట్లాడితే, ఐఫోన్ 14 వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ రియర్ కెమెరాను పొందవచ్చు. ముందు భాగంలో, ఐఫోన్ 13 వంటి నాచ్‌లో ఒకే కెమెరాను అందించే ఛాన్స్ ఉంది. ఐఫోన్ 14 సిరీస్‌తో యాపిల్ పాత ఫోన్‌ల కంటే మెరుగైన బ్యాటరీ పనితీరును అందిస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 13 సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

పుకార్లు, లీక్‌ల మేరకు iPhone 14 ధర iPhone 13 మాదిరిగానే దాదాపు $799 ఉంటుందని తెలుస్తోంది. అయితే iPhone 14 Max, Pro, Pro Max ధర దాదాపు $899, రూ. 999, రూ. 1099గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, అసలు ధరలు మాత్రం విడుదల రోజే తెలియనున్నాయి.

Also Read: Realme Dizo: రియల్‌మీ నుంచి అదిరిపోయే వాటర్ ప్రూఫ్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌.. ధర ఎంతంటే..!

Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయితే ఆ మెసేజ్‌ వెళ్లదు..