Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయితే ఆ మెసేజ్‌ వెళ్లదు..

Whatsapp: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందుస్తోంది కాబట్టే ఈ వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌ దక్కింది...

Whatsapp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయితే ఆ మెసేజ్‌ వెళ్లదు..
Follow us
Narender Vaitla

|

Updated on: May 18, 2022 | 1:13 PM

Whatsapp: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందుస్తోంది కాబట్టే ఈ వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌ దక్కింది. ఇతర యాప్స్‌ నుంచి వస్తోన్న పోటీని తట్టుకునే క్రమంలో కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచేసే పనిలో పడింది. సాధారణంగా వాట్సాప్‌ గ్రూప్‌ల నుంచి బయటకు వచ్చేస్తే ఆ గ్రూప్‌లో ఉన్న ప్రతీ సభ్యుడికి మీరు గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయినట్లు కనిపిస్తోంది.

అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు, లేదా స్నేహితులకు గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయినట్లు అలర్ట్‌ వస్తే వారు ఏమైనా అనుకుంటారేమో అనే భావన కలుగుతోంది. అలా అనీ మీకు ఆ గ్రూప్‌లో ఉండడం నచ్చదు. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇకపై గ్రూప్‌ నుంచి ఎగ్జిట్ అయితే ఆ అలర్ట్‌ గ్రూప్‌ అడ్మిన్‌కు తప్ప మరెరవరికీ కనిపించకుండా ఉండే అప్‌డేట్‌ను తీసుకురానుంది వాట్సాప్‌. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తుండగా త్వరలోనే తీసుకురానున్నారు.

మొదట డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చి తర్వాత అన్ని డివైజ్‌ల్లోనూ అప్‌డేట్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే దీంతో పాటు వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. స్టేటస్‌ అప్‌డేట్స్‌లో రిచ్‌ లింక్‌ ప్రిత్యూస్‌ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. లేటెస్ట్ బీటా వెర్షన్స్‌లో ఈ అప్‌డేట్ క‌నిపిస్తోంద‌ని వాబీటాఇన్ఫో తెలిపింది. ప్రస్తుత సెమీ ప్రివ్యూస్‌తో పోలిస్తే న్యూ లింక్ ప్రివ్యూస్ మ‌రింత స‌మ‌గ్రంగా ఉంటాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?