Realme C11: రియల్‌ మీ సీ11 పేరుతో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు.

Realme C11: వినియోగదారులను ఆట్రాక్ట్‌ చేస్తూ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే రియల్‌ మీ కంపెనీ తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌ మీ సీ11 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను రియల్‌ మీ బడ్జెట్‌ ధరలో తీసుకురావడం విశేషం...

Realme C11: రియల్‌ మీ సీ11 పేరుతో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు.
Realme C11 Features
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 10, 2021 | 9:02 PM

Realme C11: వినియోగదారులను ఆట్రాక్ట్‌ చేస్తూ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే రియల్‌ మీ కంపెనీ తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌ మీ సీ11 2021 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను రియల్‌ మీ బడ్జెట్‌ ధరలో తీసుకురావడం విశేషం. 2 జీబీ ర్యామ్‌ + 32 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను రూ. 6,999కే తీసుకొచ్చారు.. ప్రస్తుతం ఈ ఫోన్‌ను రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ అందుబాటులో ఉంచారు. ఇక ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను ప్రకటించింది రియల్‌ మీ. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుతో కొనుగోలు చేసిన 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే ఏకంగా 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నారు. వీటితో ఎస్‌బీఐ కూడా ఆఫర్‌ అందించింది. ఎస్‌బీఐ మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే..

* 6.5 అంగుళాల డిస్‌ప్లే. మినీ డ్రాప్‌ నాచ్‌ ఈ ఫోన్‌ స్క్రీన్‌ మరో ప్రత్యేకత. * ఈ ఫోన్‌ ఆక్టా కోర్ UNISOC SC9863A ప్రాసెసర్‌తో నడుస్తుంది. * ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11పై పనిచేస్తుంది. * కెమెరా విషయానికొస్తే 8 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 5 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. * ఈ కెమెరా ద్వారా 1080p వీడియో రికార్డింగ్‌ చేసుకోవచ్చు.

Also Read: Amazon: అమెజాన్‌లో ఫోన్‌ ఆర్డర్‌ చేశాడు.. వచ్చిన పార్సిల్‌ చూసి షాక్‌ అయ్యాడు. అనంతరం బాధితుడు ఏం చేశాడో తెలుసా.?

Snapdragon Insider: మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంత ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

Xiaomi 67w Fast Charger: షియోమి నుంచి 67w సూపర్ ఫాస్ట్ చార్జర్.. విడుదల ఎప్పుడంటే..!