AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme Narzo N65 5G: రియల్ మీ నుంచి అతి తక్కువ ధరకే 5జీ ఫోన్.. గ్రాండ్ లుక్.. క్రేజీ ఫీచర్స్..

రియల్ మీ ఓ కొత్త 5జీ ఫోన్ ని లాంచ్ చేసింది. అతి తక్కువ ధరలో దీనిని అందుబాటులోకి తెచ్చింది. రియల్ మీ నార్జో సిరీస్ లో దీనిని తీసుకొచ్చింది. రియల్ మీ నార్జో ఎన్65 5జీ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 11,499 నుంచి ప్రారంభమవుతుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ తో ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.

Realme Narzo N65 5G: రియల్ మీ నుంచి అతి తక్కువ ధరకే 5జీ ఫోన్.. గ్రాండ్ లుక్.. క్రేజీ ఫీచర్స్..
Realme Narzo N65 5g
Madhu
|

Updated on: May 28, 2024 | 4:23 PM

Share

మన దేశీయ మార్కెట్లో 5జీ ఫోన్ల ట్రెండ్ కొనసాగుతోంది. వినియోగదారులందరూ 5జీ ఫోన్లనుకొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. కంపెనీలు కూడా 5జీ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో రియల్ మీ ఓ కొత్త 5జీ ఫోన్ ని లాంచ్ చేసింది. అతి తక్కువ ధరలో దీనిని అందుబాటులోకి తెచ్చింది. రియల్ మీ నార్జో సిరీస్ లో దీనిని తీసుకొచ్చింది. రియల్ మీ నార్జో ఎన్65 5జీ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 11,499 నుంచి ప్రారంభమవుతుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ తో ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఇప్పుడు తెలుసుకుందాం..

రెండు వేరియంట్లు..

రియల్ మీ నార్జో ఎన్ 65 5జీ రెండు వేరియంట్లుగా మార్కెట్లోకి వచ్చింది. అవి 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,499కాగా.. 6జీబీ వేరియంట్ ధర రూ, 12,499గా ఉంది.

సేల్ ఎప్పటి నుంచి అంటే..

ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో అందుబాటులో ఉండనుంది. మొదటి సేల్ 2024, మే 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభ ఆఫర్ కింద 4జీబీ వేరియంట్ ధర రూ. 10,499, 6జీబీ వేరియంట్ రూ. 11,499కి కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ జూన్ 4వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

డిస్ ప్లే.. కెమెరా..

రియల్ మీ నార్జో ఎన్ 65 5జీ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే తో దాదాపు 89శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 625 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. వెనుక వైపు 50ఎంపీ కెమెరా, ముందువైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. నీరు, ధూళి నిరోధకత కసం ఐపీ54 రేటింగ్ ఇస్తుంది.

అప్ డేటెడ్ మినీ క్యాప్సుల్..

ఈ స్మార్ట్ ఫోన్లో అప్ గ్రేడెడ్ మినీ క్యాప్సుల్స్ 2.0, ఏఏ డైనమిక్ పవర్ బటన్ ఉంటుంది. ఇది సౌండ్ మోడ్, డూ నాట్ డిస్టర్బ్ మోడ్, రైడింగ్ మోడ్ లను ఎనేబుల్ చేయడం, డిజేబుల్ చేయడం, ఫ్లైట్ మోడ్ ని నియంత్రించడం వంటివి చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు