Realme 11 Pro Series: 200 ఎంపీ సూపర్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్.. మొట్టమొదటి సేల్ డేట్ ఫిక్స్

ఇప్పటికే రియల్ మీ 11 ప్రో సిరీస్ ఇతర దేశాల్లో మార్కెట్‌లో రిలీజ్ కావడంతో అక్కడ విపరీతంగా ప్రజలకు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 200 ఎంపీ కెమెరా విషయంలో ఈ సిరీస్ ఫోన్లు తమ మార్క్‌ను చూపిస్తున్నాయి. తాజాగా ఈ ఫోన్‌ను భారతీయులకు పరిచయం చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Realme 11 Pro Series: 200 ఎంపీ సూపర్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్..  మొట్టమొదటి సేల్ డేట్ ఫిక్స్
Realme 11 Pro 5g
Follow us
Srinu

|

Updated on: Jun 08, 2023 | 6:00 PM

చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ భారతదేశంలో రియల్‌మీ 11 ప్రో, రియల్ మీ 11 ప్రో ప్లస్ 5 జీ ఫోన్లను రిలీజ్ చేసింది. తన రియల్‌మీ 10 ప్రో సిరీస్‌కు కొనసాగింపుగా ఈ లాంచ్ చేసినట్లు మార్కెట్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఇప్పటికే రియల్ మీ 11 ప్రో సిరీస్ ఇతర దేశాల్లో మార్కెట్‌లో రిలీజ్ కావడంతో అక్కడ విపరీతంగా ప్రజలకు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 200 ఎంపీ కెమెరా విషయంలో ఈ సిరీస్ ఫోన్లు తమ మార్క్‌ను చూపిస్తున్నాయి. తాజాగా ఈ ఫోన్‌ను భారతీయులకు పరిచయం చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే జూన్ 15న ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో, జూన్ 16న ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అలాగే ధర, స్పెసిఫికేషన్ల విషయాలను అధికారికంగా ధ్రువీకరించింది. రియల్‌మీ 11 ప్రో సిరీస్ స్పెసిఫికేషన్లు, ధర విషయాలపై లుక్కేద్దాం.

రియల్ మీ 11ప్రో సిరీస్ ఫీచర్లు ఇవే

రియల్‌మీ 11 ప్రో సిరీస్‌లోని రెండు మొబైల్స్‌ 6.7 అంగుళాల కర్వ్‌డ్ అమొలెడ్ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12జీబీ+256 జీబీ వేరియంట్‌లో వినియోగదారులను పలుకరించనుంది. అలాగే రియల్ మీ యూఐ 4.0తో పాటుగా ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో చాలా బాగా పని చేస్తుంది. అలాగే ఈ రెండు వేరియంట్లల్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ప్రధానంగా రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో ప్లస్ మధ్య తేడాలు చూస్తే రియల్‌మీ 11 ప్రో మొబైల్‌కు 67వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అయితే రియల్‌మీ 11 ప్రో ప్లస్ మోడల్‌కు 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. రియల్‌మీ 11 ప్రో మొబైల్‌లో 100మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. రియల్‌మీ 11 ప్రో ప్లస్‌లో 200మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. రెండు ఫోన్లలో 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. రియల్‌మీ 11 ప్రో ప్లస్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటే రియల్‌మీ 11 ప్రో మోడల్‌లో 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఇవి కూడా చదవండి

ధరలు ఇలా

రియల్ మీ 11 ప్రో 5జీ

  • 8 జీబీ+128 జీబీ – రూ.23,999
  • 8 జీబీ+256 జీబీ – రూ.24,999
  • 12 జీబీ+256 జీబీ – రూ.27,999

రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ

  • 8 జీబీ+256 జీబీ – రూ.27,999
  • 12 జీబీ+256 జీబీ – రూ.29,999