Realme Phone: 200 ఎంపీ కెమెరాతో రియల్‌మీ నుంచి సరికొత్త ఫోన్.. వచ్చే నెలలో గ్లోబల్ లాంచింగ్..

రియల్‌మీ కెమెరాల పరంగా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు తాజా రియల్ మీ 11 సిరీస్ ఫోన్స్‌లో 200 ఎంపీ కెమెరాతో మన ముందుకు రానుంది. ఈ సిరీస్‌లోని ఫోన్లు ఇప్పటికే చైనాలో కంపెనీ లాంచ్ చేసింది. తాజాగా రియల్‌మీ 11 సిరీస్ ఫోన్లను వచ్చే నెల అంటే జూన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Realme Phone: 200 ఎంపీ కెమెరాతో రియల్‌మీ నుంచి సరికొత్త ఫోన్.. వచ్చే నెలలో గ్లోబల్ లాంచింగ్..
Realme 11 Pro
Follow us
Srinu

|

Updated on: May 18, 2023 | 5:45 PM

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం గణనీయంగా పెరిగింది. గతంలో ఫోన్లు అంటే మెసేజ్‌లతో పాటు కాల్స్ వరకూ ఉపయోగించేవారు. కానీ మారుతున్న టెక్నాలజీతో పాటు స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి రిలీజ్ కావడంతో ప్రజలు వాటిని ఎక్కువగా ఇష్టపడ్డారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అలాగే అందులో అందించే అనేక ఫీచర్లు వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. సాధారణంగా స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు ఫోన్ కొనే ముందు మొదటిగా ఆలోచించేది కెమెరా. ఎందుకంటే మన మధురమైన జ్ఞాపకాలను పొందుపర్చుకోవడానికి ప్రస్తుతం అందరూ ఫోన్లనే వాడుతున్నారు. దీంతో కంపెనీలు కూడా అధునాత టెక్నాలజీతో అత్యధిక పిక్సెల్‌తో స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. ఇదే కోవకు చెందిన రియల్‌మీ కెమెరాల పరంగా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు తాజా రియల్ మీ 11 సిరీస్ ఫోన్స్‌లో 200 ఎంపీ కెమెరాతో మన ముందుకు రానుంది. ఈ సిరీస్‌లోని ఫోన్లు ఇప్పటికే చైనాలో కంపెనీ లాంచ్ చేసింది. తాజాగా రియల్‌మీ 11 సిరీస్ ఫోన్లను వచ్చే నెల అంటే జూన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌లో మూడు ఫోన్లు ఉన్నప్పటికీ రియల్ మీ 11 ప్రో 5 జీ ఫోన్‌లో మాత్రమే 200 ఎంపీ కెమెరా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్‌లో 200 ఎంపీ కెమెరాతో ఉంది.  కాబట్టి తాజా రియల్ మీ ఫోన్ కచ్చితంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23కు ప్రధాన పోటీగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రియల్ మీ 11 సిరీస్ ఫోన్ల ప్రత్యేకతలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్ కోసం రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ మరింత మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి కొత్త హార్డ్‌వేర్‌తో పాటు కొన్ని ప్రత్యేక ఫీచర్లు కలిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ రూ.30,000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకవచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఈ ఫోన్ లెదర్ బ్యాక్, రౌండ్-రియర్ కెమెరా మాడ్యూల్‌‌తో వచ్చే అవకాశం ఉంది. మధ్యలో 200 మెగాపిక్సెల్ కెమెరాతో సామ్‌సంగ్ ఐసో సెల్ హెచ్‌పీ3 సెన్సార్ ఉంది. ప్రైమరీ కెమెరా సెన్సార్ 4 ఎక్స్ లాస్‌లెస్ జూమ్, 20 ఎక్స్ మూన్ మోడ్ జూమ్‌ను అందించవచ్చు. రెండూ హైబ్రిడ్ జూమ్ లేదా డిజిటల్ జూమ్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎమోఎల్ఈడీ స్క్రీన్, డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో 12 జీబీ+ 256 జీబీ వేరియంట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!