AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanchar Saathi: ఫోన్ దొంగతనాలకు చెక్.. మీ ఫోన్ ఎక్కడున్నా క్షణాల్లో కనిపెట్టొచ్చు.. పూర్తి వివరాలు..

మిస్సింగ్ ఫోన్లను ట్రాక్, బ్లాక్ చేసేందుకు నకిలీ ఐడెంటిటీతో తీసుకున్న ఫోన్ నంబర్లను బ్లాక్ చేసేందుకు ఈ వెబ్ సైట్ ఉపయోగపడుతుంది. దీనిని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వేల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నెల17న ప్రారంభించారు.

Sanchar Saathi: ఫోన్ దొంగతనాలకు చెక్.. మీ ఫోన్ ఎక్కడున్నా క్షణాల్లో కనిపెట్టొచ్చు.. పూర్తి వివరాలు..
Phone Stealing
Madhu
|

Updated on: May 18, 2023 | 5:45 PM

Share

ఇటీవల కాలంలో ఫోన్ ఆధారిత లావాదేవీలు అధికమయ్యాయి. డబ్బులు వేయాలన్నా.. తీయాలన్నా.. ఖర్చు చేయాలన్నా అంతా ఫోన్ నుంచే జరిగిపోతోంది. అలాంటి ఫోన్ అనుకోకుండా కనిపించకుండా పోతే! ఎవరైనా కావాలనే ఫోన్ దొంగిలిస్తే! ఎక్కడైన జారి పడిపోయే వెళ్లకూడదని వారిచేతిలోకి వెళ్తే! మీ ఖాతా మొత్తం లూటీ అవ్వడం ఖాయం. అంతేకాక మీ ఫోన్, సిమ్ కార్డులను అసాంఘికంగా వినియోగించే ప్రమాదమూ ఉంది. ఇటీవల కాలంలో ఈ తరహా ఫిర్యాదులు అధికమయ్యాయి. ఇదే క్రమంలో ఆధార్ నంబర్ ఆధారంగా నకిలీ సిమ్ కార్డులు తీసుకుని, నేరాలకు పాల్పడుతున్న కేసులు ఇటీవల అధికమయ్యాయి.

ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఓ పరిష్కారాన్ని ఆలోచించింది. అదే సంచార్ సాథీ పోర్టల్. మిస్సింగ్ ఫోన్లను ట్రాక్, బ్లాక్ చేసేందుకు నకిలీ ఐడెంటిటీతో తీసుకున్న ఫోన్ నంబర్లను బ్లాక్ చేసేందుకు ఈ వెబ్ సైట్ ఉపయోగపడుతుంది. దీనిని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వేల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నెల17న ప్రారంభించారు. మొబైల్ కనెక్షన్లు, టెలికమ్యూనికేషన్‌లకు సంబంధించి వివిధ సేవలను అందించడం ఈ పోర్టల్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పోగుట్టుకుంటే బ్లాకింగ్ ఇలా..

సంచార్ సాథీ పోర్టల్ లో మీరు పలు రకాల సేవలను పొందవచ్చు. వాటిల్లో ఒకటి సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్). ఇది దేశంలో ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్‌లను ట్రాక్ చేసేందుకు, బ్లాక్ చేసేందుకు అనుమతిస్తుంది. అలాగే టీఏఎఫ్ సీఓపీ ఫీచర్.. ఇది వినియోగదారులు వారి మొబైల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేయడం ద్వారా వారి పేరుపై జారీ చేయబడిన మొబైల్ కనెక్షన్‌ల సంఖ్యను తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఏదైనా అనధికార లేదా అవాంఛిత కనెక్షన్‌లను గుర్తించి వెంటనే బ్లాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

నకిలీ సిమ్లు బ్లాక్ చేస్తుంది..

సంచార్ సాథీ పోర్టల్ లో మరో ఆప్షన్ టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నిషన్ (ఏఎస్టీఆర్) పవర్డ్ సొల్యూషన్. ఈ ఏఐ-ఆధారిత సాంకేతికత మొబైల్ కనెక్షన్ విశ్లేషణను సులభతరం చేస్తుంది. అలాగే చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, యజమానికి ఐఎంఈఐ-ఆధారిత ఫోన్ దొంగతనం సమాచార సందేశం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది నిర్దిష్ట ఐఎంఈఐతో అనుబంధించబడిన ఏదైనా నంబర్‌ను బ్లాక్ చేయడానికి, దొంగిలించబడిన మొబైల్ పరికరాలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ టూల్‌ని ఉపయోగించి సిస్టమ్ 87 కోట్ల మొబైల్ కనెక్షన్‌లను విశ్లేషించింది. 40 లక్షల అనుమానిత మొబైల్ నంబర్‌లను గుర్తించింది. 36 లక్షల మొబైల్ నంబర్‌లను డీయాక్టివేట్ చేసింది. అలాగే 40వేల పాయింట్ల విక్రయాలను బ్లాక్‌లిస్ట్ చేసింది.

ఇలా వినియోగించాలంటే..

  • మొదటిగా సంచార్ సాథీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • దానిలో మీ పేరు, ఫోన్ నంబర్, ఐఎంఈఐ సమాచారం, మీ ఫోన్ బ్రాండ్, మోడల్, ఇన్ వాయిస్ సమాచారం దానిలో నమోదు చేయాలి.
  • అలాగే మీరు ఫోన్ పోగొట్టుకున్న నగరం, జిల్లా, రాష్ట్రం, తేదీ వంటి వివరాలు కూడా ఎంటర్ చేయండి.
  • మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కంప్లైంట్ కాపీతో ఆ పోలీస్ స్టేషన్ వివరాలను అప్ లోడ్ చేయాలి.
  • మీ పేరు, అడ్రస్, ఐడెంటిటీ పత్రం, ఈమెయల్ ఎంటర్ చేయాలి.
  • కింద ఉన్న క్యాప్చాను ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీని సబ్మిట్ చేయాలి.
  • డిక్లరేషన్ ను అంగీకరించి, సబ్మిట్ చేయాలి.

మీరు బ్లాకింగ్ రిక్వెస్ట్ ను నమోదు చేసిన 24 గంటల్లో మీ ఫోన్ బ్లాక్ అవుతుంది. ఇక దానిని నుంచి ఏ నెట్ వర్క్ అయినా పనిచేయదు. దేశంలో ఎక్కడి నుంచి కూడా అది పనిచేయదు. అయితే అది పోలీస్ ట్రాకింగ్ కు మాత్రం ఎటువంటి ఆటంకం కలిగించదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..