AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motorola Foldable Phone: మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ‘మడతపెట్టే’ ఫీచర్లతో లాంచింగ్‌కు రెడీ..

మోటోరోలా కంపెనీ కూడా తొలి ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ టీజర్ ను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.నెక్ట్స్ జెన్ రాజ్ఆర్(next-gen Razr)పేరిట దీనిని విడుదల చేసేందుకు సమాయత్తం అవుతోంది.

Motorola Foldable Phone: మోటోరోలా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ‘మడతపెట్టే’ ఫీచర్లతో లాంచింగ్‌కు రెడీ..
Motorola Foldable Phone
Madhu
|

Updated on: May 18, 2023 | 5:15 PM

Share

టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో అన్ని బ్రాండెడ్ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ఫోల్డబుల్ వేరియంట్ ఫోన్లలో శామ్సంగ్ కంపెనీ ఫోన్లు ముందంజలో ఉన్నాయి. రెండు మూడు రకాల మోడళ్లలో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చే

ఇప్పుడు ఇదే క్రమంలో లెనోవా సొంతం చేసుకున్న మోటోరోలా కంపెనీ కూడా తొలి ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ టీజర్ ను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.నెక్ట్స్ జెన్ రాజ్ఆర్(next-gen Razr)పేరిట దీనిని విడుదల చేసేందుకు సమాయత్తం అవుతోంది. జూన్ ఒకటో తేదీన నిర్వహించనున్న ‘ఫ్లిప్ ది స్క్రిప్ట్’ ఈవెంట్ లో ఈ ఫోల్డబుల్ ఫోన్ ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ఆ టీజర్ లో పేర్కొంది.  మోటో రాజ్ఆర్ 40 అల్ట్రా, అలాగే తక్కువ ధరలో లభించే మోటా రాజ్ఆర్ 40 ని కూడా అదే రోజు లాంచ్ చేయనున్నట్లు వివరించింది.

మోటో రాజ్ఆర్ 40 సిరీస్లో ఇవి ఉండొచ్చు..

ఈ ఫోన్ బయటివైపు అధిక స్థలంతో కూడిన పెద్ద డిస్ ప్లే ఉంటుంది. ఇది 2022లో వచ్చిన రాజ్ఆర్ మోడల్ కన్నా పెద్దగా ఉంటుంది. అలాగే దాని కన్నా అధిక రిఫ్రెష్మెంట్ రేట్ ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కొన్ని రిపోర్టుల ఆధారంగా అధిక ధర ఉండే మోటో రాజ్ ఆర్ 40 అల్ట్రా ఫోన్ మూడు వేర్వేరు రంగుల్లో అందుబాటులోకి రానుంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెన్ 1 చిప్ సెట్ తో రానుంది. అలాగే మరో మోడల్ మోటో రాజ్ఆర్ 40 లో బయట డిస్ ప్లే కాస్త చిన్నదిగా ఉండే అవకాశం ఉంది. అలాగే మొదటి మోడల్ తో పోల్చుకుంటే అదే విధమైన స్పెసిఫికేషన్లు ఉండే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ ఇంకా వెలువరించలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..