Realme Narzo N 53: మార్కెట్లోకి దూసుకొస్తున్న మరో రియల్‌మీ ఫోన్.. డిజైన్.. ఫీచర్స్ తెలిస్తే షాకవుతారంతే..!

ముఖ్యంగా రియల్ మీ నార్జో సిరీస్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే కంపెనీ నార్జో సిరీస్‌లో ఎన్ 55ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ సేల్స్‌లో తనదైన హవా చూపుతుంది. అయితే తాజాగా నార్జో సిరీస్ ఎన్ 53 పేరుతో మరో ఫోన్ రియల్‌మీ కంపెనీ రిలీజ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Realme Narzo N 53: మార్కెట్లోకి దూసుకొస్తున్న మరో రియల్‌మీ ఫోన్.. డిజైన్.. ఫీచర్స్ తెలిస్తే షాకవుతారంతే..!
Realme
Follow us
Srinu

|

Updated on: May 11, 2023 | 5:45 PM

ప్రస్తుతం భారతదేశంలో యువత ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఉన్న స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో తమ హవా చూపించుకునేందుకు వివిధ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఆకట్టుకునేందుకు అందుబాటు ధరల్లోనే ఇవి స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను పలుకరిస్తున్నాయి. అయితే ప్రారంభం నుంచి స్మార్ట్‌ఫోన్స్ రంగంలో తనదైన మార్క్ చూపిస్తున్న రియల్ మీ తన నార్జో సిరీస్‌లో మరోకొత్త ఫోన్ రిలీజ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రియల్ మీ నార్జో సిరీస్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే కంపెనీ నార్జో సిరీస్‌లో ఎన్ 55ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ సేల్స్‌లో తనదైన హవా చూపుతుంది. అయితే తాజాగా నార్జో సిరీస్ ఎన్ 53 పేరుతో మరో ఫోన్ రియల్‌మీ కంపెనీ రిలీజ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రియల్ మీ తన వెబ్‌సైట్‌లో ఫోన్ మోడల్ పేర్కొనకుండా పెట్టిన టీజర్‌ను చూస్తే రియల్‌మీ త్వరలో రిలీజ్ చేయబోయేది నార్జో ఎన్ 53 ఫోన్ అని మార్కెట్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అలాగే ఈ ఫోన్ గురించి పలు లీక్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఆ లీక్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఈ రియల్‌మీ నార్జో ఎన్53 ఫోన్ 16 జీబీ ర్యామ్‌తో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో 16 జీబీ డైనమిక్ ర్యామ్, 8 జీబీ ఫిజికల్ ర్యామ్‌తో పాటు 8 జీబీ వర్చువల్ ర్యామ్‌తో వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్ 5 జీ కనెక్టివిటీతో వస్తుందని, అలాగే ఫెదర్ బ్లాక్, ఫెదర్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఫోన్ 4 జీబీ + 64 జీబీ, 6 జీబీ+ 128 జీబీ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో కూడా వస్తుందని భావిస్తున్నారు.  ఈ ఫోన్ ధర కూడా రూ.13,000 లోపు ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇటీవల రిలీజ్ చేసిన నార్జో ఎన్ 55 మాదిగానే ఎన్ 53 ఫోన్‌లో కూడా అదే స్పెసిఫికేషన్లు ఉంటాయని వెల్లడిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..