Jio Prepaid Plans: ఐపీఎల్ సీజన్‌లో దుమ్మురేపుతున్న జియో ప్లాన్స్.. 3 జీబీ డేటా ప్లాన్‌తో 40 జీబీ ఫ్రీ డేటా మీకోసమే
వినియోగదారులకు అపరిమిత కాలింగ్‌తో పాటు 5 జీప్రయోజనాలతో 3 జీబీ రోజువారీ డేటా ప్యాక్‌లను అందిస్తాయి. అంతే కాదు వినియోగదారులు జియో సినిమాలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను చూడటం లేదా వారికి ఇష్టమైన సిరీస్‌లు లేదా చలనచిత్రాలను ఎక్కువగా చూడటం కొనసాగించడంలో సహాయపడటానికి ఈ ప్లాన్స్‌పై జియో గరిష్టంగా 40 జీబీ అదనపు ఉచిత డేటాను అందిస్తోంది.
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభంలో జియో కొత్త క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ ప్లాన్‌లు వినియోగదారులకు అపరిమిత కాలింగ్‌తో పాటు 5 జీప్రయోజనాలతో 3 జీబీ రోజువారీ డేటా ప్యాక్‌లను అందిస్తాయి. అంతే కాదు వినియోగదారులు జియో సినిమాలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను చూడటం లేదా వారికి ఇష్టమైన సిరీస్‌లు లేదా చలనచిత్రాలను ఎక్కువగా చూడటం కొనసాగించడంలో సహాయపడటానికి ఈ ప్లాన్స్‌పై జియో గరిష్టంగా 40 జీబీ అదనపు ఉచిత డేటాను అందిస్తోంది. రోజు వారీ 3 జీబీ డేటాతో వచ్చే రూ. 219, రూ. 399, రూ. 999 ధర కలిగిన ఈ ప్లాన్‌లు 40 జీబీ వరకు ఉచిత డేటాను అందిస్తాయి. కాలింగ్, ఎస్ఎంఎస్, ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటాయి. జియో అందించే అన్ని క్రికెట్ స్పెషల్ ప్లాన్‌లు, వాటి అదనపు ప్రయోజనాలను వివరంగా పరిశీలిద్దాం.
జియో రూ. 219 ప్లాన్
ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 100 రోజువారీ ఎస్ఎంఎస్‌తో పాటు రోజుకు 3 జీబీ డేటా వస్తుంది. అలాగే 14 రోజుల పాటు జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి. వినియోగదారులు రూ. 25 విలువైన కాంప్లిమెంటరీ 2 జీబీ డేటా యాడ్-ఆన్ వోచర్‌ను కూడా అందుకోవచ్చు. జియో వెల్‌కమ్ 5జీ ఆఫర్‌ను పొందిన వారికి అదనపు ఖర్చు లేకుండా 5 జీ డేటా కూడా అందుబాటులో ఉంటుంది.
జియో రూ. 399 ప్లాన్
ఈ ప్లాన్ కింద, వినియోగదారులు జియో యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత కాలింగ్, 100 రోజువారీ ఎస్ఎంఎస్, రోజుకు 3 జీబీ డేటాను యాక్సెస్ చేయవచ్చు. ప్రత్యేక ఆఫర్‌గా రూ. 61 విలువైన 6 జీబీ డేటా యాడ్-ఆన్ వోచర్ ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.
జియె రూ 999 ప్లాన్
జియో అందించే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 100 రోజువారీ ఎస్ఎంఎస్‌లతో పాటు రోజుకు 3 జీబీ డేటాతో పాటు 84 రోజుల పాటు జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అలాగే 5 జీకి యాక్సెస్ ఉన్న వినియోగదారులు పరిమిత సమయం వరకు రూ.241 విలువైన 40 జీబీ ఉచిత డేటాను కూడా పొందవచ్చు.
జియోలో ప్రత్యేక ప్రీపెయిడ్ మొబైల్ బేస్ ప్లాన్‌లతో పాటు క్రికెట్ డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లను కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.222 డేటా యాడ్-ఆన్ ప్లాన్ వినియోగదారులకు 50 జీబీ డేటాను అందిస్తుంది. ఈ డేటా వారి యాక్టివ్ ప్లాన్ గడువు ముగిసే వరకు చెల్లుతుంది. రూ.444 ప్లాన్ 60 రోజుల పాటు అదనంగా 100 జీబీ డేటాను అందిస్తుంది. రూ.667 ప్లాన్ 90 రోజుల చెల్లుబాటు వ్యవధితో 150 జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లను మై జియో యాప్ లేదా అధికారిక జియో వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి