Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gmail New Feature: జీమెయిల్లోకి వచ్చేసిన ‘యంత్రుడు’.. అది చేసే పని చూస్తే స్టన్ అవడం ఖాయం

ఈ-మెయిల్ మరింత వేగంగా సులభంగా రాసేందుకు వీలుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా పనిచేసే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీనిని బుధవారం జరిగిన గూగుల్ ఐ/ఓ 2023(Google I/O 2023)లో ఆవిష్కరించింది. ఈ కొత్త ఫీచర్ పేరు ‘హెల్ప్ మీ రైట్’(Help Me Write). దీని గురించి తెలుసుకుందాం..

Gmail New Feature: జీమెయిల్లోకి వచ్చేసిన ‘యంత్రుడు’.. అది చేసే పని చూస్తే స్టన్ అవడం ఖాయం
Gmail
Follow us
Madhu

|

Updated on: May 11, 2023 | 4:45 PM

విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరికీ జీమెయిల్ సుపరిచితమే. గూగుల్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్లాట్ ఫారం వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్లు, ఫీచర్లను అందిస్తోంది. ఇదే క్రమంలో ఈ-మెయిల్ మరింత వేగంగా సులభంగా రాసేందుకు వీలుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా పనిచేసే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీనిని బుధవారం జరిగిన గూగుల్ ఐ/ఓ 2023(Google I/O 2023)లో ఆవిష్కరించింది. ఈ కొత్త ఫీచర్ పేరు ‘హెల్ప్ మీ రైట్’(Help Me Write). వినియోగదారులు ఇచ్చే ఇన్ పుట్స్ ఆధారంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తనే ఈ మెయిల్ డ్రాఫ్ట్ లను తయారు చేసి అందిస్తుంది. దీని వల్ల వినియోగదారుల సమయం ఆదా అవడంతో పాటు పని సులభం అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎలా పనిచేస్తుందంటే..

ఈ హెల్ప్ మీ రైట్ అనే ఫీచర్ ను వినియోగించుకోవాలంటే మొదటిగా మీరు ఈ మెయిల్ టైప్ చేయడం ప్రారంభించాలి. ఆ తర్వాత “Help Me Write” అనే బటన్ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీరు రాయాలనుకున్న ఈ మెయిల్ డ్రాఫ్ట్ ను క్షణాల్లో తయారు చేసి ఇస్తుంది. దానిని మీరు అవసరమైన మార్పులు, చేర్పులు చేసి ఫైనలైజ్ చేయొచ్చు.

ఇది అన్ని రకాల ఈమెయిల్ టాస్క్ లను చేయగలుగుతుంది. మీరు ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పాలన్నా, మీటింగ్ షెడ్యూల్ కు సంబంధించిన సమాచారం ఇవ్వాలన్నా మెయిల్ అదే క్రియేట్ చేస్తుంది. అలాగే జాబ్ అప్లికేషన్లు, రీఫండ్ కోరుతూ పంపే ఈమెయిల్స్ అన్నీ కూడా టెమ్ ప్లేట్స్ అందులో ఉంటాయి. దీని వల్ల వినియోగదారులకు టైం ఆదా అవడంతో పాటు పని చాలా సులభతరం అవుతుంది. అలాగే ఏఐ నిరంతరం నేర్చుకుంటూనే ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో మరింత కచ్చితమైన సమాధానాలు, మెయిల్స్ అందించే విధంగా తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రయోజనాలు ఇవి..

  • ఇది ఈ మెయిల్ డ్రాఫ్ట్‌లను రూపొందించడం ద్వారా మీ సమయాన్ని ఆదా చేస్తుంది.
  • ఇది సలహాలు, అభిప్రాయాన్ని అందించడం ద్వారా మీ రైటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది.
  • ఇది మరింత ప్రొఫెషనల్‌గా కనిపించే ఈ మెయిల్‌లను రూపొందించడంలో మీకు సహాయపడుతుంది.
  • ఇది మీ ఈమెయిల్ టెంప్లేట్‌లను ట్రాక్ చేయడం ద్వారా క్రమబద్ధంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది.
  • ప్రస్తుతం దీనిని గూగుల్ అందరికీ ఉచితంగానే అందిస్తోంది.

ఈ చిట్కాలు పాటించండి..

  • మీరు ఏఐకి ఇన్‌పుట్ అందించినప్పుడు వీలైనంత కచ్చితంగా ఉండాలి. మీరు ఎంత ఎక్కువ సమాచారం ఇస్తే, అది రూపొందించిన డ్రాఫ్ట్ అంత మెరుగ్గా ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ ఏఐ టెక్నాలజీ టెస్టింగ్ దశలోనే ఉంది కాబట్టి.. అది అందించే డ్రాఫ్ట్ లను సవరించడానికి ప్రయత్నించండి.
  • ఏఐ అందించిన డ్రాఫ్ట్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు ఎంత ఎక్కువ అభిప్రాయాన్ని అందిస్తే, ఈ మెయిల్ డ్రాఫ్ట్‌లను రూపొందించడంలో ఏఐ అంత మెరుగ్గా మారుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..