Realme Narzo N53: రియల్‌మీ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. రూ. 11 వేలలో 50 ఎంపీ కెమెరా.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తోంది. రియల్‌మీ నార్జో ఎన్53 పేరుతో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను మే 18వ తేదీన తీసుకురానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. అమెజాన్‌లో ఈ స్మార్ట్ అందుబాటులోకి రానుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు...
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తోంది. రియల్‌మీ నార్జో ఎన్53 పేరుతో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను మే 18వ తేదీన తీసుకురానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. అమెజాన్‌లో ఈ స్మార్ట్ అందుబాటులోకి రానుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు.
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 10,999గా ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకురానున్నారు. బ్యాటరీ విషయానికొస్తే రియల్‌మీ నార్జో ఎన్53 స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీనిని ఇవ్వనున్నారు. ఇక ఈ ఫోన్‌లో 90 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.72 ఇంచెస్ డిస్‌ప్లేను ఇచ్చారు. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ వీ13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను 7.49 ఎమ్.ఎమ్ మందంతో రూపొందించారు. 34 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తి కావడం ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 6 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌తో పాటు 2 జీబీ వరకు స్టోరేజీ కెపాసిటీని పెంచుకోవచ్చు. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..