AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Masked Aadhar Card: మాస్క్‌డ్ ఆధార్ కార్డుతో ప్రయోజనాలు తెలుసా? ఇప్పుడే డౌన్ లోడ్ చేసుకోండి..

అయితే ఈ ఆధార్ కార్డుకు మరింత భద్రతను పెంచుతూ మాస్క్‌డ్ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) తీసుకొచ్చింది. ఇది అవసరమైన డేటా వరకూ మాత్రమే బయట వ్యక్తులు చూపి.. నంబర్ ను దాచి ఉంచుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Masked Aadhar Card: మాస్క్‌డ్ ఆధార్ కార్డుతో ప్రయోజనాలు తెలుసా? ఇప్పుడే డౌన్ లోడ్ చేసుకోండి..
Aadhar Card
Madhu
|

Updated on: Jun 08, 2023 | 5:30 PM

Share

ఆధార్ నంబర్.. ప్రతి భారతీయ పౌరుడికి ఓ గుర్తింపు. ఇది ఉంటేనే ప్రభుత్వ నుంచి ఏ పథకమైనా మంజూరవుతుంది. బ్యాంకు ఖాతా కావాలన్నా, లైసెన్సు, రిజిస్ట్రేషన్ ఇలా ఏది కావాలన్నా ఆధార్ నంబర్ తప్పనిసరి. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆధార్ నంబర్ భద్రత విషయంలో కూడా కాస్త అప్రమత్తంగానే ఉండాలి. నేరగాళ్ల చేతుల్లోకి మీ ఆధార్ నంబర్ వెళ్తే వారు దానిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించే అవకాశం. అందుకే ఆధార్ కాపీలను ఎక్కడపడితే అక్కడ ఇవ్వవద్దని ప్రభుత్వం సూచిస్తుంది. అయితే ఈ ఆధార్ కార్డుకు మరింత భద్రతను పెంచుతూ మాస్క్‌డ్ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) తీసుకొచ్చింది. ఇది అవసరమైన డేటా వరకూ మాత్రమే బయట వ్యక్తులు చూపి.. నంబర్ ను దాచి ఉంచుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మాస్క్‌డ్ ఆధార్ కార్డు అంటే..

డౌన్‌లోడ్ చేసుకునే ఈ-ఆధార్‌లో నంబర్లు అన్నీ కనిపించకుండా చేసుకోవడమే ఈ మాస్క్‌డ్ ఆధార్ ఉపయోగమని యూఐడీఏఐ పేర్కొంటోంది. ఆధార్ నంబర్లు 12 ఉంటాయి. అయితే ఈ మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ చేసుకుంటే అందులోని తొలి ఎనిమిది నంబర్లు XXXX-XXXX అని మాస్క్ అయి కనిపిస్తాయి. చివరి నాలుగు నంబర్లు మాత్రం కనిపిస్తాయి.

మాస్క్‌డ్ ఆధార్ కార్డు వల్ల ప్రయోజనాలు ఇవి..

ఇది వినియోగదారుడి ప్రైవసీని కాపాడుతుంది. అలాగే ఆధార్ కార్డు అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించకుండా సంరక్షిస్తుంది. దీనిని దాదాపు అన్ని ఆర్గనైజేషన్స్ అంగీకరిస్తాయి. ఆధార్ నంబర్‌ తప్పకుండా సమర్పించాల్సిన అవసరం లేని.. కేవలం ఈ-కేవైసీ మాత్రం ఇవ్వాల్సిన సందర్భాల్లో మాస్క్‌డ్ ఆధార్‌ కార్డును ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

మాస్క్‌డ్‌ ఆధార్‌ డౌన్‌లోడ్ ఇలా..

  • అధికారిక యూఐడీఏఐ వెబ్‌సైట్‌ myaadhaar.uidai.gov.inని ఓపెన్‌ చేయాలి.
  • అందులో కనిపించే ట్యాబ్‌లలో ‘మై ఆధార్’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • డ్రాప్-డౌన్ మెనూలో ‘డౌన్‌లోడ్ ఆధార్’ సెలక్ట్‌ చేసుకోవాలి.
  • ఆ తర్వాత 12-అంకెల ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను ఎంటర్‌ చేయమని కనిపిస్తుంది.
  • ఆ తర్వాత ‘మాస్క్‌డ్‌ ఆధార్’ ఆప్షన్‌ సెలక్ట్‌ చేయాలి.
  • తర్వాత క్యాప్చా కోడ్‌ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
  • అక్కడ డ్రాప్-డౌన్ మెనూలో ‘సెండ్ ఓటీపీ’ క్లిక్‌ చేయాలి.
  • ఆధార్‌కు లింక్‌ అయిన ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేశాక మాస్క్‌డ్‌ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • అది పీడీఎఫ్ ఫార్మేట్ లో డౌన్ లోడ్ అవుతుంది. దీనికి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీ పేరులో మొదటి నాలుగు ఆక్షరాలు, మీ డేట్ ఆఫ్ బర్త్‌లోని సంవత్సరం దీనికి పాస్‌వర్డ్. మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలను ఇంగ్లిష్ క్యాపిటల్ లెటర్స్‌లో టైప్ చేసి.. ఆ తర్వాత పుట్టిన సంవత్సరాన్ని సంఖ్యల రూపంలో టైప్ చేసి ఎంటర్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..