Realme 9i: కస్టమర్లకు బంపర్ ఆఫర్… ఫ్లిప్ కార్ట్ లో రూ.599 కే రియల్ మీ 9ఐ 5జీ ఫోన్..
తాజాగా అత్యంత ప్రజాదారణ పొందిన రియల్ మీ 9ఐ ఫోన్ భారీ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తుంది. కస్టమర్లకు కేవలం రూ.599 కే రియల్ మీ 9ఐ ఫోన్ చేతికి వస్తుంది.
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ లు ఉంటున్నాయి. ఏ చిన్న అవసరానికైనా స్మార్ట్ ఫోన్స్ పైనే ఆధారపడుతున్నాం. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి. తాజాగా అత్యంత ప్రజాదారణ పొందిన రియల్ మీ 9ఐ ఫోన్ భారీ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తుంది. కస్టమర్లకు కేవలం రూ.599 కే రియల్ మీ 9ఐ ఫోన్ చేతికి వస్తుంది. కానీ కొన్ని నిబంధనలు మేరకే ఈ ఫోన్ ఆ రేట్ కు వస్తుంది. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీని రిటైల్ ధర రూ.15999. అయితే ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో కొంటే 31.25 శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే 5000 వరకూ ధర తగ్గుతుంది. ఈ ఆఫర్ మాత్రమే కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా వినియోగించుకుంటే రూ.10400 వరకూ తగ్గింపు లభిస్తుంది. అంటే రియల్ మీ 9ఐ ఫోన్ కేవలం రూ.599 కే వినియోగదారుడికి అందుతుంది. ఇది ఎమ్మార్పీ పై 99 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే ఎక్స్చేంజ్ వాల్యూ మాత్రం మనం ఎక్స్చేంజ్ చేసే ఫోన్ ఫై ఆధారపడి ఉంటుందని గమనించాలి.
రియల్ మీ 9ఐ ఫీచర్లు
- 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
- స్నాప్ డ్రాగ్నన్ 680 ప్రాసెసర్ విత్ 610 జీపీయూ
- ఎండ్రాయిడ్ 11 సపోర్టెడ్, రియల్ మీ యూఐ 2.0
- 50 ఎంపీ బ్యాక్ కెమెరా తో ట్రిపుల్ కెమెరా సెటప్
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..