Pure EV Bike: బైక్ ప్రియులకు ఎలక్ట్రిక్ కిక్.. మార్కెట్ లోకి కొత్త బైక్..ఓ సారి చార్జ్ చేస్తే 130 కి.మి మైలేజ్
టూ వీలర్స్ లో స్కూటర్ శ్రేణి వాహనాలనే కంపెనీ ఎక్కువగా లాంచ్ చేస్తున్నాయి. ఈ విషయంలో బైక్ ప్రియులు అసంతృప్తితో ఉన్నారు.
ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీలు సరికొత్తగా ఈవీ వెహికల్స్ ను మార్కెట్ లోకి లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే కార్ల కంటే ఎక్కువగా టూ వీలర్స్ మార్కెట్ లోకి ఎక్కువ వస్తుంది. టూ వీలర్స్ లో స్కూటర్ శ్రేణి వాహనాలనే కంపెనీ ఎక్కువగా లాంచ్ చేస్తున్నాయి. ఈ విషయంలో బైక్ ప్రియులు అసంతృప్తితో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి వారిని టార్గెట్ చేస్తూ ప్యూర్ ఈవీ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. ఎకో డ్రైఎఫ్ టీ పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ నాలుగు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. బ్లాక్, గ్రే, రెడ్, బ్ల్యూ కలర్స్ లో వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు చెబతున్నాయి.
హైదరాబాద్ లోనే ప్యూర్ ఈవీ తయారీ కేంద్రంలోనే ఈ బైక్ ను తయారు చేస్తున్నారు. ఈ బైక్ ధర అన్ని సబ్సిడీలో రూ.99,999 కు ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఎకో డ్రైఎఫ్ టీ బైక్ ఆన్ రోడ్ ధర రూ.1,14,999 గా ఉంటుంది. అయితే ఆన్ రోడ్ ధర రాష్ట్రాలను బట్టి మారుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే ఈ బైక్ గరిష్టంగా గంటకు 75 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. అలాగే ఈ బైక్ శక్తినివ్వడానికి 3 కేడబ్యూహెచ్ బ్యాటరీ, 3 కెడబ్ల్యూ మోటర్ ను అమర్చారు. ఈ బైక్ లో మూడు రైడిండ్ మోడ్ లు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా వందకంటే ఎక్కువ డీలర్ల వద్ద డెమో వాహనాలుగా ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్నాయి. అలాగే ఆయా డీలర్ల వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించామని, మార్చి 1 నుంచి మొదటి బ్యాచ్ వాహనాలను డెలివరీ చేస్తామని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్ వదేరా చెప్పారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా డీలర్ షిప్ చైన్ ను విస్తరిస్తామని తెలిపారు. అనంతరం ఈ బైక్ దక్షిణాసియా దేశాలకు ఎగుమతి చేసే ప్రణాళికలో ఉన్నామని పేర్కొన్నారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం