Samsung Galaxy: సామ్ సంగ్ గాలాక్సీ యూజర్లకు షాకింగ్ న్యూస్.. మీ డేటా భద్రత గాల్లోనే.. !

స్మార్ట్ ఫోన్స్ విషయంలో సామ్ సంగ్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. లక్షాలాది మంది వినియోగదారులు సామ్ సంగ్ లోని గాలక్సీ సిరీస్ ను ఇష్టపడుతున్నారు.

Samsung Galaxy: సామ్ సంగ్ గాలాక్సీ యూజర్లకు షాకింగ్ న్యూస్.. మీ డేటా భద్రత గాల్లోనే.. !
Samsung Phone
Follow us

|

Updated on: Jan 31, 2023 | 1:16 PM

ప్రస్తుతం ప్రతి చిన్న అవసరానికి అంతా ఫోన్లపై ఆధారపడుతున్నారు. గతంలో ఫోన్లు అంటే కేవలం కాల్స్ మాట్లాడడానికి, మెసెజ్ పంపుకోడానికి మాత్రమే ఉపయోగించే వారు. అయితే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మొబైల్స్ లోనే కెమెరా, ఇతర అప్ డేట్స్ ఉండడంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. కంపెనీలు కూడా వినియోగదారులను ఆకట్టుకునే లేటెస్ట్ అప్ డేట్స్ స్మార్ట్ ఫోన్స్ ను  మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ విషయంలో సామ్ సంగ్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. లక్షాలాది మంది వినియోగదారులు సామ్ సంగ్ లోని గాలక్సీ సిరీస్ ను ఇష్టపడుతున్నారు. అయితే అప్ డేట్స్ ను గెలాక్సీ లోని కొన్ని వెర్షన్లకు కంపెనీ నిలిపేసింది. కొన్ని వాటికి అప్ డేట్స్ ఇచ్చినా వినియోగదారులకు ఆకట్టుకోలేకపోయింది. దీంతో చాలా మంది యూజర్లు గాలక్సీలోని పాత వెర్షన్లతో నే ఫోన్ వాడుతున్నారు. 

ఇలా గెలాక్సీ ఫోన్స్ లో పాత వెర్షన్లు వాడుతున్న వినియోగదారులకు షాక్ ఇస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ కొత్త విషయాన్ని బయటపెట్టింది. సామ్ సంగ్ గెలాక్సీ ఫోన్స్ లో పాత వెర్షన్లు వాడేవారి ఫోన్స్ లో అన్ వాంటెడ్ యాప్స్ ను ఇన్ స్టాల్ చేసేయవచ్చని హెచ్చరింది. ఇది వినియోగదారుల గోప్యతకు భంగం కల్పిస్తుందని తెలిపింది. గెలాక్సీ వెర్షన్ 4.5.49.8 కు ముందు వెర్షన్లు వాడుతున్న వినియోగదారులకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే యాప్స్ లో నిక్షిప్తమయ్యే బ్యాంకింగ్ డేటా కూడా చోరీ చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ స్పెషల్ హైపర్ లింక్ ను మెసేజ్ లో పంపుతారు. ఆ లింక్ ను క్లిక్ చేస్తే చోరులు మన ఫోన్ ను వారి కంట్రోల్ లోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులు భద్రతకు భంగం వాటిల్లతుంది. కాబట్టి ఇలాంటి మోసాల నుంచి జాగ్రత్త పడడానికి కచ్చితంగా లెటెస్ట్ వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు