Smart Watch: దేశీయ మార్కెట్లోకి ఎంటరైన ‘కోబ్రా’.. అతి తక్కువ బడ్జెట్‌ లో అదరగొట్టే పీచర్స్‌తో..

ఫైర్-బోల్ట్ కంపెనీ మన దేశంలో అత్యంత పటిష్టమైన స్మార్ట్‌ వాచ్‌ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇది అవుట్‌ డోర్‌ శ్రేణికి చెందిన మోడల్‌ కాగా దుమ్మూ, నీరు, స్ప్లాష్‌, అధిక ఒత్తిడి తట్టుకోగలుగుతుంది.

Smart Watch: దేశీయ మార్కెట్లోకి ఎంటరైన ‘కోబ్రా’.. అతి తక్కువ బడ్జెట్‌ లో అదరగొట్టే పీచర్స్‌తో..
Fire Boltt Cobra
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Feb 01, 2023 | 11:22 AM

ప్రస్తుతం అంత స్మార్ట్‌ వాచ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. అందరూ మణికట్టుకు అధునాతన సాంకేతికతో కూడిన వాచ్‌లను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో వివిధ కంపెనీలు రకరకాల మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా ఫైర్-బోల్ట్ కంపెనీ మన దేశంలో అత్యంత పటిష్టమైన స్మార్ట్‌ వాచ్‌ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇది అవుట్‌ డోర్‌ శ్రేణికి చెందిన మోడల్‌ కాగా దుమ్మూ, నీరు, స్ప్లాష్‌, అధిక ఒత్తిడి తట్టుకోగలుగుతుంది.  ఈ స్మార్ట్‌ వాచ్‌ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్పెక్స్ అండ్‌ ఫీచర్లు..

కోబ్రా వాచ్ మూడు-లేయర్డ్ బాడీ కంపోజిషన్‌ను కలిగి ఉంది. ఇది చాలా వెయిట్‌ లెస్‌. దీనికి తుప్పు పట్టదు. దీని మెటల్ ఫ్రేమ్ చర్మానికి అనుకూలమైన పట్టీలను కలిగి ఉంది. దీనికి IP68 రేటింగ్‌ ఉంది. 500 నిట్స్ బ్రైట్‌ నెస్‌, 60Hz రిఫ్రెష్ రేట్, 368×448 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 1.78-అంగుళాల AMOLED ఆల్‌వేస్‌ ఆన్ స్క్రీన్ ఉంది.

123 స్పోర్ట్స్‌ మోడ్స్..

ఈ స్మార్ట్ వాచ్లో దాదాపు 123 స్పోర్ట్స్ మోడ్‌ ఉన్నాయి. ఫిజికల్‌ యాక్టివిటీస్‌ సమయంలో చిన్న చిన్న వివరాలను కూడా ట్రాక్ చేయడానికి తెలివైన స్పోర్ట్స్ అల్గారిథమ్ ఫీచర్‌ ఇందులో ఉంది. అదనంగా, 24×7 డైనమిక్ హార్ట్‌ రేట్‌ మోనిటర్‌, SpO2 పర్యవేక్షణ, స్త్రీ ఆరోగ్య సంరక్షణ, స్లీప్‌ మోనటరింగ్‌ వంటి ఆరోగ్య పీచర్లు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

బ్లూటూత్‌ కాలింగ్‌ ఆప్షన్‌..

ఇది కాకుండా, ఫైర్-బోల్ట్ కోబ్రా ‍స్మార్ట్‌ వాచ్‌ లో అధిక-నాణ్యత కలిగిన బ్లూటూత్ కాలింగ్ కోసం ఇన్‌ బిల్ట్‌ స్పీకర్ మైక్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 రోజుల వరకు వస్తుంది. దీనిలో బ్యాటరీ-సేవర్ మోడ్ కూడా ఉంది. దీనిని ఆన్‌లో ఉంచితే 30 రోజుల వరకు బ్యాటరీని వినియోగించుకోవచ్చు.

అదనపు హంగులు..

అంతేకాక రిమోట్‌ కెమెరా, మ్యూజిక్‌ కంట్రోల్స్‌, ఇన్‌ బిల్ట్‌ గేమ్స్‌ ఉంటాయి. అలాగే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ AI వాయిస్ అసిస్టెంట్, పీరియాడికల్ హెల్త్ రిమైండర్‌, వాతావరణ సూచనలు, అలారం గడియారం, టైమర్, ఫ్లాష్‌లైట్, స్టాప్‌వాచ్ ఫీచర్లు కూడా ఉంటాయి.

ధర ఎంతంటే..

ఫైర్‌ బోల్ట్‌ కోబ్రా స్మార్ట్‌ వాచ్‌ ధర రూ. 3,499గా నిర్ధారించారు. జనవరి 31 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌ లో దీని అమ్మకాలు ప్రారంభమవుతాయి. సాలిడ్ గ్రీన్, సాలిడ్ బ్లాక్, కామోఫ్లేజ్‌ గ్రీన్‌, కామోఫ్లేజ్‌ బ్లాక్‌ రంగుల ఆప్షన్లలో ఇది లభ్యమవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..