Chat GPT: కలకలం సృష్టిస్తున్న చాట్ జీపీటీ.. బెంగళూరులో బ్యాన్.. అసలు ఏముంది అందులో..

గూగుల్ సెర్చ్ ఇంజిన్ మనకు కావాల్సిన ఇన్ ఫర్మేషన్ ను వెతికి మనకు ఇస్తుంది. దానికి సొంతంగా ఆలోచించడం రాదు. అయితే ఈ చాట్ జీపీటీ అలా కాదు. దీనిలోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అడిగిన సమాచారాన్ని ఎంతో కచ్చితంగా ఇస్తుంది.

Chat GPT: కలకలం సృష్టిస్తున్న చాట్ జీపీటీ.. బెంగళూరులో బ్యాన్.. అసలు ఏముంది అందులో..
Chatgpt
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Feb 01, 2023 | 2:00 PM

చాట్ జీపీటీ.. కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్.. ఇది ప్రపంచంలో కలకలం సృష్టిస్తోంది. దీనిలోని అత్యాధునిక ఫీచర్స్ మనిషిని రిప్లేస్ చేయగలదని చాలా మంది నమ్ముతున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ మనకు కావాల్సిన ఇన్ ఫర్మేషన్ ను వెతికి మనకు ఇస్తుంది. దానితో పాటు మనం వెతికే పద బంధాలకు అనుగుణంగా వాటికి సంబంధం ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని మనకు చూపిస్తోంది. దానికి సొంతంగా ఆలోచించడం రాదు. అయితే ఈ చాట్ జీపీటీ అలా కాదు. దీనిలోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అడిగిన సమాచారాన్ని ఎంతో కచ్చితంగా ఇస్తుంది. మనం తప్పుగా అడిగితే తప్పని చెబుతుంది. మనం అడిగే ప్రశ్నలకు మనిషిలా ఆలోచించి సమాధానాలు ఇస్తుంది. విద్యార్థుల సందేహాలు తీరుస్తుంది. పిల్లల కథల నుంచి సాఫ్ట్ వేర్ కోడల్ వరకూ అన్నీ రాసిపెడుతోంది.

నవంబర్ లో ఆవిష్కరణ..

గత నవంబర్ లో ఆవిష్కరించిన ఈ ప్లాట్ ఫామ్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఎంతలా అంటే పలు యూనివర్సిటీలు, కాలేజీలు ఈ చాట్ జీపీటీని బ్యాన్ చేసేంత.. మీరు వింటున్నది నిజమే ఏదైనా అత్యాధునిక సాంకేతికత వస్తే ఆహ్వానించాలి.. ఆస్వాదించాలి కానీ నిషేధించడం ఏమిటి? అని ఆలోచిస్తున్నారా? మీకు దీనిపై క్లారిటీ రావాలంటే దీని వల్ల కలుగుతున్న ప్రభావాల గురించి తెలుసుకోవాలి..

ఏదైనా సాధ్యమే..

చాట్ జీపీటీ ద్వారా మనిషి చేయగలిగే ప్రతి విషయం అచ్చం మనిషిలాగే చేయగలుగుతుంది. కంప్యూటర్ ప్రోగ్రాములు రాయడం, వాటిలోని తప్పులు(బగ్స్)ను గుర్తించి తొలగించడం కూడా ఇది చేస్తుంది. సంగీతాన్ని పొందుపరచడం, టెలివిజన్ నాటకాలు, కల్పిత కథలు రాయడం వంటివి చేసేస్తుంది. విద్యార్థలకు వ్యాసాలు రాయడమే కాకుండా పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులను ఇస్తుంది. పాటలు కూడా రాస్తుంది. కంప్యూటరఱ్ ఆపరేటింగ్ సిస్టమ్ డేటా అనలిటిక్స్ తయార చేయడం, ఇలా ఒకటేమిటి సర్వజ్ఞానిలా అన్ని చేయగలుగుతుంది. సరిగ్గా ఈ అంశమే పలు యూనివర్సిటీలు దీనిని బ్యాన్ చేసేలా చేశాయి.

ఇవి కూడా చదవండి

విద్యార్థుల అసైన్ మెంట్ స్వరూపాన్నే మార్చేందుకు..

కర్ణాటకలోని దయానంద సాగర్ విశ్వవిద్యాలయం, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సంస్థలు చాట్ జీపీటీ వంటి AI సాధనాలపై విద్యార్థులు ఆధారపడకుండా నిరోధించే చర్యలను అన్వేషిస్తున్నాయి. దయానంద సాగర్ యూనివర్శిటీలోని అధికారులు సమస్యను పరిష్కరించేందుకు అసైన్‌మెంట్ల స్వరూపాన్ని మార్చాలని యోచిస్తున్నారు. క్రైస్ట్ యూనివర్శిటీ వంటి ఇతర సంస్థలు కూడా విద్యార్థులను ఏఐ సాధనాల నుండి దూరంగా ఉంచే చర్యలపై ఆలోచిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరు (IIIT-B) చాట్‌ జీపీటీని ఉపయోగించడంపై నిర్మాణాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చాట్ జీపీటీ కోసం చేయవలసినవి, చేయకూడని వాటి చెక్‌లిస్ట్‌ అందిస్తుంది.

అంతర్జాతీయంగా పలుచోట్ల నిషేధం..

అంతర్జాతీయంగా కూడా పలు చోట్ల ఈ కృత్రిమ మేథతో కూడిన చాట్ జీపీటీని బ్యాన్ చేశాయి. దానిలో ఫ్రాన్స్ లోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటైన సైన్సెస్ పో, న్యూయార్క్ విద్యాశాఖ, సీటెల్ లోని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..