Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo Mobiles: మార్కెట్‌ను ఊపేస్తోన్న ఒప్పో ఫోన్లు.. ఆ రెండు మోడళ్లపై భారీ తగ్గింపు.. మునుపెన్నడూ లేనంతగా..

అత్యంత ప్రజాదరణ పొందిన ఒప్పో మొబైల్స్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు మీకు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. అవి ఒప్పో ఎఫ్23, ఒప్పో ఏ17 మొబైళ్లు. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వీటిపై అదిరే ఆఫర్లను అందిస్తున్నాయి.

Oppo Mobiles: మార్కెట్‌ను ఊపేస్తోన్న ఒప్పో ఫోన్లు.. ఆ రెండు మోడళ్లపై భారీ తగ్గింపు.. మునుపెన్నడూ లేనంతగా..
Oppo F23
Follow us
Madhu

|

Updated on: May 30, 2023 | 8:30 AM

మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకొంటున్నారా? హై రిజల్యూషన్ తో కూడిన కెమెరా సెటప్ అందులో ఉండాలా? అధిక సామర్థ్యం కలిగిన ప్రాసెసర్ కూడా కావాలా? అది కూడా అందుబాటు ధరలోనే ఉండాలా? అయితే మీకివే బెస్ట్ ఆప్షన్స్. అత్యంత ప్రజాదరణ పొందిన ఒప్పో మొబైల్స్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు మీకు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. అవి ఒప్పో ఎఫ్23, ఒప్పో ఏ17 మొబైళ్లు. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వీటిపై అదిరే ఆఫర్లను అందిస్తున్నాయి. దాదాపు 16శాతం వరకూ డిస్కౌంట్ తో పాటు పలు బ్యాంక్ ఆఫర్లు, పాత ఫోన్ ఎక్స్ చేంజ్ తో అతి తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఒప్పో ఎఫ్23, ఒప్పో ఏ17 ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, డిస్కౌంట్లపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఒప్పో ఎఫ్23 5జీ..

ఒప్పో ఎఫ్23 5జీ మొబైల్ అసలు ధర రూ. 28,999కాగా ఇది అమెజాన్ లో ఆఫర్ లో రూ. 24,999కే లభిస్తోంది. దాదాపు 14శాతం డిస్కౌంట్ పై ఇది లభ్యమవుతోంది. దీంతో పాటు పలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ చేంజ్ పై ధర తగ్గింపు ఉంటుంది.

స్పెసిఫికేషన్లు.. దీనిలో 6.72 అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. 1080*2412 పిక్సల్ రిజల్యూషన్ ఉంటుంది. దీనిలో ప్రధాన కెమెరా 64ఎంపీ ఉంటుంది. దీనితో పటు 2ఎంపీ లెన్స్, 2ఎంపీ డెప్త్ కెమెరాలు ఉంటాయి. ముందు వైపు 32 ఎంపీ స్పెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో, ఆక్టా కోర్ సీపీయూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సామర్థ్యం.. దీనిలో 8జీబీ ర్యామ్ సైజ్ ఉంటుంది. దీంతో పాటు ఆడ్రెనో 619 జీపీయూ ఉంటుంది. ఇది మల్టీ టాస్కింగ్ చేయడానికి, మంచి గ్రాఫిక్స్ అందించడానికి ఉపకరిస్తుంది. దీనిలో 5000ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ చార్జ్ చేయడానికి 67వాట్ల వీఓఓసీ చార్జింగ్ టెక్నిక్ ను వినియోగించారు.

ఒప్పో ఏ17..

ఈ మొబైల్ సాధారణ ధర రూ. 14,999కాగా.. ఫ్లిప్ కార్ట్ లో ఇది 12,499కే లభిస్తోంది. అంటే దాదాపు 16శాతం డిస్కౌంట్ లో లభ్యం అవుతోంది. దీనికి అదనంగా బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ చేంజ్ డీల్స్ ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. పాత ఫోన్ పరిస్థితిని బట్టి ఎక్స్ చేంజ్ పై ఏకంగా రూ. 11,950 వరకూ వ్యాల్యూ ఇస్తారు.

స్పెసిఫికేషన్లు.. దీనిలో 6.56 అంగుళాల బెజెల్ లెస్ ఐపీఎస్ ఎల్సీడ డిస్ ప్లే ఉంటుంది. 720*1612 రిజల్యూషన్ తో ఇది ఉంటుంది. వెనుక వైపు 50 ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్ కెమెరా కూడా ఉంటుంది. ముందు వైపు 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

సామర్థ్యం.. ఈ ఫోన్లో 4జీబీ ర్యామ్ ఉంటుంది. మీడియా టెక్ హీలియో జీ35 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. అలాగే గ్రాఫిక్స్ కోసం పవర్ వీఆర్ జీఈ8320 జీపీయూ ఉంటుంది. దీనిలో 5000 ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..