Safety Password: దాదాపు 30 దేశాలలో ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్ అదేనట.. మీది కూడా అదేనా ..? చూసుకోండి..

దాదాపుగా అన్ని ఫోన్లకు పాస్‌వర్డ్ ఉంటుంది. నిజానికి ఈ పాస్‌వర్డ్ అనేది ఫోన్‌లో మనం భద్రపరిచిన సమాచారానికి రక్షన వలయం లాంటిదని మనందరికీ తెలుసు.నొర్డ్‌పాస్ అనే పాస్‌వర్డ్ మేనేజ్మెంట్..

Safety Password: దాదాపు 30 దేశాలలో ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్ అదేనట.. మీది కూడా అదేనా ..? చూసుకోండి..
Password
Follow us

|

Updated on: Nov 24, 2022 | 12:37 PM

దాదాపుగా అన్ని ఫోన్లకు పాస్‌వర్డ్ ఉంటుంది. నిజానికి ఈ పాస్‌వర్డ్ అనేది ఫోన్‌లో మనం భద్రపరిచిన సమాచారానికి రక్షన వలయం లాంటిదని మనందరికీ తెలుసు.నొర్డ్‌పాస్ అనే పాస్‌వర్డ్ మేనేజ్మెంట్ సోల్యూషన్స్ సంస్థ పాస్వర్డ్‌ల విషయంలో ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఓ ఆసక్తి కరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అది ఏమిటంటే.. దాదాపు 30కి పైగా దేశాలలో Samsung లేదా  samsung అనేది సర్వసాధరణమైన పాస్వర్డ్ అంట. ఇక సామ్‌మొబైల్ ప్రకారం.. మన సమాచారాన్ని కాపాడుకోవడానికి ఫోన్ లేదా టీవీ కంపెనీల పేర్లను పాస్వర్డ్‌గా పెట్టుకోవడమనేది అంత సురక్షితమైన పని కాకపోయినప్పటికీ.. చాలా దేశాలలో దానినే పాటిస్తున్నారు.

అయితే ఎక్కువగా ఉపయోగించే పాస్వర్డ్‌ల జాబితాలో ‘సామ్‌సంగ్’ 2019 వరకు 198వ స్థానంలో ఉండగా..  ఇది 2020లో 189వ స్థానానికి, 2021లో 78వ స్థానానికి చేరుకుంది. ఇలా గత ఏడాది టాప్-100 మార్కును అధిగమించింది. ఇక ఈ జాబీతాలో అత్యంత ప్రజాదరణ పొందిన పాస్‌వర్డ్ ‘‘పాస్‌వర్డ్’’.  దాదాపు 50 లక్షల మంది వినియోగదారులు దీనినే వినియోగించుకుంటారని అనేక నివేదికలు వెలువడ్డాయి. అయితే అతి సాధారణంగా ఉపయోగించే ఇతర పాస్‌వర్డ్‌లలో ‘123456’, ‘123456789’ ఉన్నాయి.

ఇటీవలి ఓ నివేదిక ప్రకారం.. సాధారణ, ఊహాజనిత పాస్‌వర్డ్‌ను ఒక సెకను కంటే తక్కువ వ్యవధిలో చేధించవచ్చు. అయితే చిన్న, పెద్ద అక్షరాలను సంఖ్యలతో కలపడం అనేది కొంత రక్షణను కల్పిస్తుంది. సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లలో ఎక్కువ భాగం ఒక సెకను కంటే తక్కువ వ్యవధిలో చేధించదగినవే అని నొర్డ్‌పాస్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..